విశాఖలో భూముల క్రయవిక్రయాలపై ఆరోపణలు.. ఆధారాలు చూపండి : టీడీపీకి మంత్రి గుడివాడ సవాల్

By Siva KodatiFirst Published Sep 16, 2022, 5:37 PM IST
Highlights

విశాఖలో భూముల క్రయవిక్రయాలపై తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ఆరోపణలపై స్పందించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. సిట్టింగులకే సీట్లిస్తాను అంటే ప్రతిపక్షంలో సగం మంది అసెంబ్లీకి రాలేదంటూ అమర్‌నాథ్ సెటైర్లు వేశారు

అసెంబ్లీలో పరిశ్రమలపై స్వల్ప చర్చ జరిగిందన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీఎం చెప్పారని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రధమ స్థానంలో ఏపీ ఉందన్నారు. 301 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారని అమర్‌నాథ్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వచ్చే చిత్తశుద్ధి, గౌరవం లేదని... చంద్రబాబు ఆలోచనలను ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో మాత్రమే ప్రతిపక్షం నం.1 అంటూ గుడివాడ సెటైర్లు వేశారు. తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నం.1 అని మంత్రి చెప్పారు. 

1.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి రానున్నాయని.. ఇన్పోసిస్ లాంటి సంస్ధలు విశాఖ కేంద్రంగా పని చేస్తున్నాయని అమర్‌నాథ్ వెల్లడించారు. త్వరలో విశాఖలో బిజినెస్ డెవలప్‌మెంట్ సమిట్ ఉంటుందని.. గతంలో లాగా డిప్లొమేటిక్ గా కాదన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన నగరం విశాఖ అని.. ప్రతిపక్ష నాయకుల మాటలకు రుజువులు చూపించాలని గుడివాడ్ సవాల్ విసిరార. విశాఖ రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేటు భూమి తీసుకోవడం లేదని.. సిట్టింగులకే సీట్లిస్తాను అంటే ప్రతిపక్షంలో సగం మంది అసెంబ్లీకి రాలేదంటూ అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. 

Latest Videos

Also Read:అమరావతిని ముక్కలు చేసి... వికేంద్రీకరణ అంటారా, విశాఖలో 70 వేల ఎకరాల్లో గోల్‌మాల్ : టీడీపీ

వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుండి పాలన సాగుతుందని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్ర ఆర్ధిక వృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగిందన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై సోమవారం సీఎం చర్చకు సమాధానం ఇస్తారని మంత్రి తెలిపారు. గడిచిన 3 సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడులు, భవిష్యత్ లో జరిగే అభివృద్ధిని తెలియచేశామని గుడివాడ వెల్లడించారు. చంద్రబాబు ఈస్ అఫ్ సెల్లింగ్ బిజినెస్ లో నంబర్ వన్ అంటూ మంత్రి దుయ్యబట్టారు. 

రాష్ట్రానికి 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని.. ఎంఎస్ఎంఈ ద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. బీచ్‌ఐ టి కాన్సెప్ట్ తో విశాఖ ను అభివృద్ది చేయడం మా లక్ష్యమని అమర్‌నాథ్ తెలిపారు. 2023 ఫిబ్రవరిలో విశాఖ కేంద్రంగా ఇన్వెస్ట్మెంట్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధిలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నామని గుడివాడ తెలిపారు. విశాఖ నగరంలో భూముల క్రయవిక్రయాలపై జరిగి ఉంటే టిడిపి నిరూపించాలని అమర్‌నాథ్ సవాల్ విసిరారు. అమరావతిలో జరిగిన విశాఖలో జరిగిన క్రయవిక్రయాలు ఒక్కటేనా అని ఆయన ప్రశ్నించారు. పాదయాత్ర పేరుతో రేపు వైజాగ్‌లో ఏమి జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలని అమర్‌నాథ్ తెలిపారు. విశాఖలో రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేట్ భూమి తీసుకోవడం లేదన్నారు. 
 

click me!