2జీ స్పెక్ట్రమ్ రేంజ్‌లో ఫైబర్‌నెట్‌లో అక్రమాలు.. చంద్రబాబు జైలుకు వెళ్లకతప్పదు: మంత్రి గౌతమ్ రెడ్డి

By Siva KodatiFirst Published Jul 18, 2021, 6:22 PM IST
Highlights

2జీ స్పెక్ట్రమ్ తరహాలో చంద్రబాబు అండ్ కో చేసిన అవకతవకలన్నీ బయటికి వస్తాయని గౌతమ్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని మంత్రి గౌతమ్ రెడ్డి జోస్యం చెప్పారు. చంద్రబాబు కారణంగా ఏపీ ఫైబర్ నెట్ రూ.650 కోట్ల మేర అప్పులపాలైందని ఆరోపించారు. 
 

ఏపీ ఫైబర్ నెట్‌లో కుంభకోణం జరిగిందన్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని, సీఐడీ రేపో మాపో పేర్లతో సహా అక్రమార్కుల బండారం బట్టబయలు చేస్తుందని ఆయన హెచ్చరించారు. 2జీ స్పెక్ట్రమ్ తరహాలో చంద్రబాబు అండ్ కో చేసిన అవకతవకలన్నీ బయటికి వస్తాయని గౌతమ్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని మంత్రి గౌతమ్ రెడ్డి జోస్యం చెప్పారు. 

చంద్రబాబు కారణంగా ఏపీ ఫైబర్ నెట్ రూ.650 కోట్ల మేర అప్పులపాలైందని ఆరోపించారు. వచ్చే ఏడాది నాటికి ఆ అప్పు అంతటినీ తీర్చేస్తామని మంత్రి అన్నారు. 2021 డిసెంబరు కల్లా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ పార్కులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

ALso Read:చంద్రబాబుకు షాక్.. ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ, ఏపీ సర్కార్ ఆదేశాలు

కాగా, ఏపీ ఫైబర్ నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణకు వైఎస్ జగన్ సర్కార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఫైబర్ నెట్ టెండర్లు ఖరారు చేసినట్లు గుర్తించారు. 
 

click me!