మదనపల్లిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని 4 రోజులుగా మెకానిక్‌ నిర్భంధం

Published : Jul 18, 2021, 05:06 PM ISTUpdated : Jul 18, 2021, 05:08 PM IST
మదనపల్లిలో దారుణం:  యాక్సిడెంట్ చేశాడని 4 రోజులుగా మెకానిక్‌ నిర్భంధం

సారాంశం

చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకొంది. మెకానిక్ కార్తీక్ కారును తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశారనే నెపంతో   నాలుగు రోజులుగా షోరూమ్‌లోనే నిర్భంధించారు. ఈ విషయమై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.


చిత్తూరు: షోరూం నుండి  కారును తీసుకెళ్లి యాక్సిడెంట్  చేశాడనే నెపంతో  మెకానిక్ కార్తీక్‌‌ను  మేనేజర్‌ నిర్భంధించాడు. ఈ విషయమై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో చోటు చేసుకొంది.ఓ కారు షోరూం లో కార్తీక్  మెకానిక్ గా పనిచేస్తున్నాడు.  మేనేజర్ కు తెలియకుండానే  కార్తీక్ కారును తీసుకెళ్లాడు.  అయితే కారును తీసుకెళ్లి  యాక్సిడెంట్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న షోరూమ్ మేనేజర్ కార్తీక్ ను నాలుగు రోజులుగా షోరూమ్ లోనే బంధించాడు.

ఈ విషయం తెలుసుకొన్న దళిత సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.కార్తీక్  కారును ఎందుకు షోరూం నుండి తీసుకెళ్లారు,  యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, నాలుగు రోజులుగా  కార్తీక్ ను ఎందుకు  నిర్భందించారనే విషయమై పోలీసులు ఈ దర్యాప్తులో తేల్చనున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కార్తీక్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu