క్షమాపణ చెప్పి ఏపీలో అడుగుపెట్టు: మోదీకి గంటా వార్నింగ్

By Nagaraju TFirst Published Dec 25, 2018, 10:25 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే నైతిక హక్కు మోదీకి లేదని విమర్శించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన ప్రధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

చిత్తూరు: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే నైతిక హక్కు మోదీకి లేదని విమర్శించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన ప్రధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలను నరేంద్రమోదీ నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసిన మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. 

ఇకపోతే నరేంద్రమోదీ జనవరి 6న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరులో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేసిన సహాయం, బీజేపీ బలోపేతం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

అలాగే బీజేపీపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న విమర్శలకు ప్రజల సాక్షిగా సమాధానం చెప్పాలని మోదీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మోదీ ఏపీలో పర్యటిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా కానీ మోదీ పర్యటనపై టీడీపీ మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. 

click me!