
విజయవాడ, సింహాచలం ఆలయాల్లో తాంత్రిక పూజల ఘటనలు మరవకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ప్రధాన ఆలయానికి సమీపంలో తాంత్రిక పూజలు జరిగినట్లు వార్తలు రావడంతో దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. తాంత్రిక పూజలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కోన్న ఆలయ వేదపండితుడు గంటి రాధాకృష్ణపై విచారణ జరిపిన ఈవో ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.