శ్రీమంతానికి వెళ్లివస్తూ ప్రమాదం..గర్భిణీ సహా నలుగురి మృతి

Published : Dec 25, 2018, 09:42 AM IST
శ్రీమంతానికి వెళ్లివస్తూ ప్రమాదం..గర్భిణీ సహా నలుగురి మృతి

సారాంశం

ఆనందంగా శ్రీమంతం చేసుకొని వస్తుండగా.. ఊహంచని రోడ్డు ప్రమాదం జరిగింది. అంతే.. గర్భిణీ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ఆనందంగా శ్రీమంతం చేసుకొని వస్తుండగా.. ఊహంచని రోడ్డు ప్రమాదం జరిగింది. అంతే.. గర్భిణీ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను, కారు ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ట్రాక్టర్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. మృతులను గుంటూరు గోరంట్లకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు జయశ్రీ, అనసూయ, రమాదేవి, డ్రైవర్‌ ఫ్రాన్సిస్‌ ఉన్నారు. కారులో  ప్రయాణిస్తున్న వారంతా చిలకలూరిపేట మండలం యడవల్లిలో సీమంతం కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్