తీరంలో ఇరుక్కుపోయిన మంత్రి గంటా కారు

By ramya neerukondaFirst Published Dec 17, 2018, 2:19 PM IST
Highlights

48గంటలపాటు ఏపీని వణికించిన పెథాయ్ తుఫాను ఎట్టకేకలకు ఈ రోజు తీరం దాటింది. యానాంకి సమీపంలోని కాట్రేనికోన వద్ద తుఫాను తీరం దాటింది.

48గంటలపాటు ఏపీని వణికించిన పెథాయ్ తుఫాను ఎట్టకేకలకు ఈ రోజు తీరం దాటింది. యానాంకి సమీపంలోని కాట్రేనికోన వద్ద తుఫాను తీరం దాటింది. తీరం దాటినప్పటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తున్నాయి. కాగా.. జిల్లాలో పరిస్థితిని పరీక్షించడానికి వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇరకాటంలో పడ్డారు.

విశాఖలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కాగా..పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు తుఫాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటించారు. కాగా.. అలా వెళ్లిన ఆయన వాహనం తీరం వద్ద ఇసుకలో ఇరుక్కుపోయింది.  భీమిలి బీచ్ కి సమీపంలోని మంగమర్రిపేట వద్ద మంత్రి వారు ఇసుకలో కూరుకుపోయింది. దీంతో.. వెంటనే ఆయన సిబ్బంది ఆ కారును బయటకు తీసుకురావడానికి చాలానే కష్టపడ్డారు. 

click me!