పాపం గంటా... కౌన్సిల్ ఓట్ల కష్టాలు

First Published Mar 9, 2017, 10:23 AM IST
Highlights

రోడ్డు మీద టెంటులో  ఓటర్ స్లిప్పులందించే చోట గంటా... కారణమేమై ఉంటుంది

గంటా శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి.

మామూలు మంత్రి కాదు. బాగా ధనబలం ఉన్నవాడు.  అన్ని పార్టీలలో కూడా మంచి పేరున్నవాడు.  అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రి పదవి వుంటుంది.  ఇలాంటి మంత్రి ఈ రోజు ఇలా రోడ్డు మీద టేబులేసుకుని సాధారణ పార్టీ కార్యకర్తల మధ్య  ఎమ్మెల్సీ వోటర్లకు  స్లిప్పులిచ్చే చోట కూర్చున్నారు.

 

భీమిలి నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఇలా మంత్రి ఈ రోజు  రోడ్డు మీద టేబులేసుకుని సాధారణ పార్టీ కార్యకర్తల మధ్య  ఎమ్మెల్సీ వోటర్లకు స్లిఫ్పులిచ్చేచోట ఉండగా  ఫోటోగ్రాఫర్ కంటపడ్డారు.

 

పార్టీ సాధారణ సైనికుడిలాగా పనిచేస్తున్నాడని అనుకోవాలా లేక  రానున్న కష్టాలకు సంకేతమనుకోవాలా.

 

 ఏమయినా ఈ విషయం ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమయింది. ఈ రోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి కౌన్సిల్ ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. స్థానిక టిడిపి నాయకులు అప్పల నరసింహరాజు, భాస్కరరావు, కాశీ విశ్వనాథ్ తదితరులతోకలసి ఇలా టెంటులో కూర్చుని కార్యకర్తగా పనిచేయడం అరుదైన దృశ్యమట.. ఈ ఫోటో బాబు కంట పడితే కొన్ని మార్కులు పడే అవకాశం కూడా ఉంది.

 

గంటా విశాఖ జిల్లా నుంచి గెల్చినా, రాజకీయాలంటే ఉదాసీనంగానే ఉంటారు. అందుకే, ఈ ఉదాసీనత ఈ ఎన్నికల్లో తెలుగుదేశం మీద దాడి చేసేందుకు ప్రత్యర్థులకు బాగా ఉపయోగపడింది. విశాఖ నుంచి క్యాబినెట్ లో మూడేళ్లుగా ఉంటున్నా ఆయన ఉత్తరాంధ్ర కు చేసిందేమీ లేదనేది బాగా వినిపించిన విమర్శ. వీటికి సమాధానంగా నేమో ఆయన  రోడ్డున పడి సాధారణ కార్యకర్త గామారి పోయి ఇలా ఓటరు స్పిప్పులందించే పనికి పూనుకున్నారు.

click me!