హైదరాబాద్‌ లాంటి తప్పు మళ్లీ చేయొద్దు .. వైసీపీ విధానం ఇదే : మంత్రి ధర్మాన ప్రసాదరావు

Siva Kodati |  
Published : Feb 15, 2023, 09:50 PM ISTUpdated : Feb 15, 2023, 09:53 PM IST
హైదరాబాద్‌ లాంటి తప్పు మళ్లీ చేయొద్దు  .. వైసీపీ విధానం ఇదే : మంత్రి ధర్మాన ప్రసాదరావు

సారాంశం

రాజధాని విషయంలో వికేంద్రీకరణ అవసరమన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు ఇప్పుడు మరోసారి చేయొద్దని ఆయన సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసిపి కట్టుబడి పని చేస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. 

ఏపీలో రాజధాని అంశం కాకరేపుతోన్న సంగతి తెలిసిందే. అతి త్వరలో విశాఖ నుంచి పాలన సాగిస్తామని, తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతానని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ తర్వాతి నుంచి వైసీపీ నేతలు, మంత్రులు సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంలో డీసెంట్రలైజేషన్ కావాల్సిన అవసరం ఉందని.. రాజధాని పేరు చెప్పి ఒకే ప్రాంతంలో పెట్టుబడులు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర విభజనలో సెక్షన్ 5, 6 ప్రకారం కమిటీ నివేదికలు ఇచ్చారని.. కమిటీల సూచనలలో వివిధ ప్రాంతాలు అభివృద్ధి కావాలని స్పష్టంగా చెప్పాయని ధర్మాన గుర్తుచేశారు. హైదారాబాద్ రాజధానిగా పెట్టుబడులన్ని 75 ఏళ్లుగా అక్కడే పెట్టారని.. చివరకు హైదరాబాదు ఒక ప్రాంతానికి పరిమితమైందని, అక్కడి‌ నుండి ఏపీ ప్రజలు వదిలి రావాల్సి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యంగా వదిలేయడం కరెక్టేనా అని ధర్మాన ప్రశ్నించారు. 

ALso REad: త్వరలో విశాఖ నుంచి పాలన.. శివరామకృష్ణన్ చెప్పిందే చేస్తున్నాం : రాజధానిపై బుగ్గన సంచలన వ్యాఖ్యలు

శివరామకృష్ణ కమిటీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని నివేదిక ఇచ్చిందని.. వైసిపి ప్రభుత్వం మరో‌ కమిటి నియమించిందని ప్రసాదరావు తెలిపారు. శివరామకృష్ణ కమిటీని అధ్యాయనం చేసిందని.. కేంద్రం నియమించిన కమిటీ చెప్పిన అంశాలు గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. అది అన్యాయమని.. శ్రీకృష్ణకమిటీ సిఫార్సులు కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్లిందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసిపి కట్టుబడి పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. 

అంతకుముందు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమీషన్, పార్లమెంట్‌లు సైతం వికేంద్రీకరణే మంచిదన్నాయని గుర్తుచేశారు. దేశంలో 8 రాష్ట్రాల్లో కూడా కోర్టు ఒక చోట, రాజధాని మరోచోట వున్నాయని బుగ్గన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్