కొడుకు, భర్త, మామ సైకిల్‌కే వేయమంటారు.. మగాళ్ల మాట వినొద్దు, మీ ఓటు జగన్‌కే : మహిళలకు ధర్మాన పిలుపు

By Siva KodatiFirst Published Mar 27, 2023, 9:34 PM IST
Highlights

కొడుకు, భర్త, మామ సైకిల్‌కి వేయాలని చెబుతుంటారని.. కానీ మహిళలు ఆలోచించి ఓటు వేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.  జగన్‌కు వ్యతిరేకంగా ఆడపడుచులు ఓట్లు వేస్తే వాళ్లు చేతులు నరుక్కున్నట్లేనని ధర్మాన హెచ్చరించారు.
 

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు . జగన్ ప్రభుత్వం మహిళల చేతికే పూర్తిగా అధికారం ఇచ్చిందన్నారు. కొడుకు, భర్త, మామ సైకిల్‌కి వేయాలని చెబుతుంటారని.. కానీ మహిళలు ఆలోచించి ఓటు వేయాలని ధర్మాన పిలుపునిచ్చారు. ఓటు ఎవరికి వేసింది రహస్యంగా వుంటుంది కాబట్టి .. మగాళ్ల మాట ఈ విషయంలో వినొద్దన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా ఆడపడుచులు ఓట్లు వేస్తే వాళ్లు చేతులు నరుక్కున్నట్లేనని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. ఆర్ధిక పరిస్ధితులు బాగోనప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని.. కానీ కొందరు మహిళలు సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.     

అంతకుముందు  చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెన్నుపోటు, కొనటం, నయవంచనే.. చంద్రబాబు విజయ రహస్యమని విమర్శించారు. స్టీఫెన్ సన్‌కు డబ్బు ఎరవేసి దొరికిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. గతంలో వైపీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని అన్నారు. చంద్రబాబు చరిత్ర అంతా ఏమార్చి రాజకీయం చేయడమేనని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమేనని పేర్ని నాని విమర్శించారు. 

Also Read: ఎమ్మెల్యేలను కొనేసి .. గెలిచామని సంబరాలు సంబరాలా : చంద్రబాబుపై మంత్రి కొట్టు ఆగ్రహం

నిజాయితీ ఉంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీలో అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టికెట్‌ దక్కదనే ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. 
 

click me!