వెన్నుపోటు, కొనటం, నయవంచనే చంద్రబాబు విజయ రహస్యం.. పేర్ని నాని సంచలనం..

Published : Mar 27, 2023, 05:42 PM IST
వెన్నుపోటు, కొనటం, నయవంచనే చంద్రబాబు విజయ రహస్యం.. పేర్ని నాని సంచలనం..

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై మాజీ మంత్రి, వైసీపీఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెన్నుపోటు, కొనటం, నయవంచనే.. చంద్రబాబు విజయ రహస్యమని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై మాజీ మంత్రి, వైసీపీఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెన్నుపోటు, కొనటం, నయవంచనే.. చంద్రబాబు విజయ రహస్యమని విమర్శించారు. స్టీఫెన్ సన్‌కు డబ్బు ఎరవేసి దొరికిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. గతంలో వైపీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని అన్నారు. చంద్రబాబు చరిత్ర అంతా ఏమార్చి రాజకీయం చేయడమేనని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమేనని పేర్ని నాని విమర్శించారు. 

నిజాయితీ ఉంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీలో అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టికెట్‌ దక్కదనే ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. 

Also Read: ఉండవల్లి శ్రీదేవికి మరో షాక్.. ప్రచార రథం లాక్కుపోయిన మహిళ, నాదేనంటూ ఆధారాలు

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్