అన్యాయం జరగదు.. ఆందోళన విరమించండి: రాజధాని రైతులకు బొత్స విజ్ఞప్తి

By sivanagaprasad KodatiFirst Published Dec 23, 2019, 8:47 PM IST
Highlights

రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తామని, రైతులు ఇకనైనా ఆందోళన విరమించాలని ఆయన సూచించారు.

27 వ తేదీ రాజధాని అంశం తుది నిర్ణయం వస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన.. జి యన్ రావు కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో...అసెంబ్లీ అమరావతి లో, కర్నూల్ లో హై కోర్ట్, విశాఖ లో సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సిఫార్సు చేశారని తెలిపారు.

Also Read:ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఎంక్వైరీ వేసుకుని.. చర్యలు తీసుకోవచ్చు: జగన్‌కు బాబు సవాల్

గత రెండు రోజులు నుంచి అమరావతి ప్రాంతంలో కొందరు నిరసన చేస్తూ ఉంటే ప్రతి పక్ష నేత చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్నారు. సచివాలయం, హైకోర్ట్ ఉండడం వల్ల ఏ ప్రాంత అభివృద్ధి జరగదు అని చంద్ర బాబు చెప్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:ఏపీలో మూడు రాజధానులు: లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న టీడీపీ నేత

రాజధాని , రాజధాని కట్టడాలు పెరు చెప్పి దోచుకున్నారని ఎంతో దోపిడీ జరిగిందని బొత్స ఆరోపించారు. 13 జిల్లాల అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యమని.. అద్దె కళాకారులుతో దుర్భశాలాడిస్తున్నారో చూస్తున్నామని మంత్రి దుయ్యబట్టారు.

అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని జీఎన్ రావు కమిటీ నివేదికలో పేర్కొందని సత్యనారాయణ గుర్తుచేశారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తామని, రైతులు ఇకనైనా ఆందోళన విరమించాలని ఆయన సూచించారు. శ్రీకృష్ణ, శివరామకృష్ణ, జీఎన్ రావు కమిటీలటు దగ్గరగా ఉన్నాయని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

click me!