ఏ క్షణమైనా విశాఖకు పరిపాలనా రాజధాని: బొత్స సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 28, 2021, 5:19 PM IST
Highlights

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామన్నారు. రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. 

కోర్టులో వున్న అంశాన్ని అధిగమించి ఏ క్షణమైనా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి వున్న అద్బుతమైన అవకాశాన్ని చంద్రబాబు పాలనలో దుర్వినియోగం చేశారని బొత్స మండిపడ్డారు.  కో

ర్టుకు వాస్తవాలు వివరిస్తామని, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.  మిగిలిన 32 మున్సిపాల్టీలు, 3 కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

విలీన గ్రామాలతోనే రాజమండ్రి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లకు మార్చి 31 నుంచి వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని బొత్స  సత్యనారాయణ పేర్కొన్నారు.
 
click me!