తిరుపతి ఉప ఎన్నిక: జగన్‌పై ప్రశంసలు.. ట్రోలింగ్, రత్నప్రభ క్లారిటీ

By Siva KodatiFirst Published Mar 28, 2021, 4:32 PM IST
Highlights

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే ఏపీ తరఫున పార్లమెంట్‌లో గళం వినిపిస్తానన్నారు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇన్నాళ్లకు మాతృభూమికి సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే ఏపీ తరఫున పార్లమెంట్‌లో గళం వినిపిస్తానన్నారు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇన్నాళ్లకు మాతృభూమికి సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు.

పనిచేయడంలోనే తనకు అమితానందం ఉంటుందన్న రత్నప్రభ.... కేవలం తిరుపతి కోసమే కాకుండా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానని వెల్లడించారు. బీజేపీ- జనసేనకు మద్దతు లేదన్న ప్రచారం సరికాదని రత్నప్రభ హితవు పలికారు .

తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 200 శాతం సంతృప్తిగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రచారానికి తనను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు రత్నప్రభ వెల్లడించారు.

గతంలో సీఎం జగన్‌ను తాను ప్రశంసించిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని రత్నప్రభ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిపని చేస్తే ప్రశంసించానని.. అంతమాత్రాన మద్దతు ఇచ్చినట్లు కాదని ఆమె స్పష్టం చేశారు.

డబ్బుకు ఓటెయ్యాలో.. నీతి నిజాయతీకో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభ రేపు నెల్లూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 
 

click me!