మరో వారం రోజులు ఒంటి పూట బడులు.. టీచర్లకు బోధన తప్ప మరో పని చెప్పం: మంత్రి బొత్స

Published : Jun 19, 2023, 04:57 PM IST
మరో వారం రోజులు ఒంటి పూట బడులు.. టీచర్లకు బోధన తప్ప మరో పని చెప్పం: మంత్రి బొత్స

సారాంశం

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్ల పంపిణీ వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్ల పంపిణీ వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామని చెప్పారు. 
1.75 లక్షల మంది ఉఫాద్యాయులలో 82 వేల మంది బదిలీకి ధరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో 52 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని తెలిపారు. వడగాల్పులు తీవ్రత దృష్ట్యా, సీఎం ఆదేశాలమేరకు మరో వారం రోజులు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మూడవ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రాథమిక స్ధాయి నుంచే నాణ్యమైన‌ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి బొత్స చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల ద్వారా ఉపాధ్యాయులకి డిజిటల్ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రైమరీ స్ధాయిలో పదివేల స్మార్ట్ టివీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

ఇక, జూన్ 12న ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు జరపాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికీ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఒంటిపూట బడులను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారం.. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నీళ్ళొద్దు గొడవలే కావాలిఅనే రకం వాళ్ళది: సీఎం | Asianet News Telugu
CM Chandrababu Naidu: రైతులతో కలిసి పొలానికి వెళ్లిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu