ఈ తీర్పు జగన్ ముందే ఊహించారు : మున్సిపల్ ఫలితాలపై బొత్స స్పందన

By Siva KodatiFirst Published Mar 14, 2021, 3:54 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కనిపించకుండా తుడిచిపెట్టుకుపోయిందని.. ఇది ఒక చరిత్ర అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారో, మళ్లీ 20 నెలల తర్వాత జగన్ పరిపాలనకు పట్టం కట్టారని బొత్స చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కనిపించకుండా తుడిచిపెట్టుకుపోయిందని.. ఇది ఒక చరిత్ర అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారో, మళ్లీ 20 నెలల తర్వాత జగన్ పరిపాలనకు పట్టం కట్టారని బొత్స చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ ఒక్క ప్రెస్ మీట్ కానీ, బహిరంగ సభ కూడా పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ధన ప్రవాహం, దౌర్జాన్యాలు చేసినా మనదే విజయమని జగన్ ధీమా వ్యక్తం చేశారని.. ప్రజలు అందుకు అనుగుణంగానే తీర్పు ఇచ్చారని బొత్స సత్యనారాయణ తెలిపారు. 

అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి జనం బుద్ధి చెప్పారని సజ్జల తెలిపారు. అప్పుడు 151 సీట్ల మెజారిటీతో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

Also Read:మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ: ఈ స్థానాల్లో ఒక్క స్థానం కూడ దక్కలేదు

యువ నాయకుడు జగన్ ‌పై ఆశలు, నమ్మకం వుందని జనం పదే పదే గుర్తుచేస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆ ఎన్నికలు ముగిసిన 20 నెలల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

టీడీపీని రిజెక్ట్ చేస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శమని సజ్జల ఎద్దేవా చేశారు. వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల  కోసం ఎలాంటి మేనిఫెస్టో విడుదల చేయలేదని, సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సైతం రాలేదని ఆయన గుర్తుచేశారు.

అక్కడక్కడా ఫలితాలు నిరాశ పరిచినప్పటికీ, రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభంజనం వుందని సజ్జల తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వుంటామని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2014లో నోటి దాకా వచ్చిన అధికారం పోయినప్పటికీ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించామని.. చౌకబారు రాజకీయాలు చేయలేదని సజ్జల చెప్పారు.

click me!