ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ప్రభావం చూపని బీజేపీ, జనసేన కూటమి

Published : Mar 14, 2021, 03:33 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ప్రభావం చూపని బీజేపీ, జనసేన కూటమి

సారాంశం

రాష్ట్రంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి ఏ మాత్రం ప్రభావం చూపలేదు.కొన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్ధులు విజయం సాధించారు. కానీ బీజేపీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు.


అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి ఏ మాత్రం ప్రభావం చూపలేదు.కొన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్ధులు విజయం సాధించారు. కానీ బీజేపీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు.

గత ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు  ప్రతి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీలు ప్రకటించాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జనసేన కొంత ప్రభావాన్ని చూపింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడ ఆ పార్టీ ఈ ప్రభావాన్ని కొనసాగించింది.

తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్ధులు విజయం సాధించారు. విశాఖ కార్పోరేషన్ లో కూడ జనసేన అభ్యర్ధులు గెలుపొందారు. బీజేపీ అభ్యర్ధులు ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

త్వరలోనే  తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం పరిధిలో బీజేపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. జనసేన అభ్యర్ధి ఒక్క స్థానంలో విజయం సాధించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, జనసేన కూటమి ప్రయత్నాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ కూటమికి  ఆశించినట్టుగా లేవనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని తరలింపు అంశంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహరం కూడ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్ధమౌతోంది. విశాఖలోని 20 డివిజన్లలో స్టీల్ ప్లాంట్ కొంత ప్రభావం చూపింది.
 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP