విశాఖ అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే.. నువ్వేం చేశావ్: బాబుపై బొత్స ప్రశ్నల వర్షం

Siva Kodati |  
Published : Mar 07, 2021, 04:45 PM IST
విశాఖ అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే.. నువ్వేం చేశావ్: బాబుపై బొత్స ప్రశ్నల వర్షం

సారాంశం

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూ రికార్డులు తారుమారయ్యాయా..? లేదా అంటూ ప్రశ్నించారు.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూ రికార్డులు తారుమారయ్యాయా..? లేదా అంటూ ప్రశ్నించారు.

విశాఖ వచ్చి  చంద్రబాబు ఏదేదో మాట్లాడారంటూ చురకలు వేశారు. ఐదేళ్ల పాలనలో పేదవారికి ఒక్క ఇల్లయినా ఇచ్చారంటూ అంటూ బొత్స నిలదీశారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగిందని.. విశాఖకు సెజ్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డేనని సత్యనారాయణ పేర్కొన్నారు.

విశాఖలో లక్షా 78 వేల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని మంత్రి ప్రకటించారు. చంద్రబాబు మాటలు విడ్డూరంగా వున్నాయని.. సుదీర్ఘ అనుభవం వుందని చెప్పుకునే ఆయన నోట అబద్ధాలు , అవాస్తవాలు వస్తున్నాయని బొత్స ఎద్దేవా చేశారు.

విశాఖలో భూరికార్డులు తారుమారవ్వడానికి చంద్రబాబు, లోకేశ్‌లే బాధ్యులని మంత్రి ఆరోపించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నది టీడీపీ కదా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు కోర్టుకెళ్లి ఇళ్ల పట్టాల పంపిణీకి ఆటంకాలు సృష్టించారని మంత్రి ధ్వజమెత్తారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!