విదేశాల్లో రాసలీలలు .. వార్డ్ మెంబర్‌గా గెలవలేవు, నాపై విమర్శలా: లోకేశ్‌కి బాలినేని కౌంటర్

By Siva KodatiFirst Published Mar 7, 2021, 4:16 PM IST
Highlights

టీడీపీ నేత, ఎమ్మెల్సీ  నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్‌కు తనను విమర్శించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు


టీడీపీ నేత, ఎమ్మెల్సీ  నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్‌కు తనను విమర్శించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్‌ ఒక దరిద్రుడని, చంద్రబాబు ఒక నీచుడని వీరిద్దరూ ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారని బాలినేని ఆరోపించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ తనపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

ప్రత్తిపాటితో కలిసి లోకేష్ పేకాట క్లబ్‌ నడిపిన విషయం ప్రజలకు తెలుసునంటూ బాలినేని చురకలంటించారు. తాను కులాలు చూడలేదని.. కమ్మవారికి కూడా కార్పొరేషన్‌లో టికెట్ ఇచ్చానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై తన వద్దకు వస్తే పరిష్కరించానని, ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత తెలుగుదేశానికి లేదని బాలినేని విమర్శిచారు. గతంలో ఒంగోలును అభివృద్ధి చేశానని.. ఇప్పుడూ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు .

టీడీపీ ఇన్‌ఛార్జ్‌ దామచర్ల జనార్ధన్‌ బాగోతం అందరికీ తెలుసునని  బాలినేని ఆరోపించారు. తనకు సంస్కారం ఉంది కాబట్టి.. వ్యక్తిగత విమర్శలు చేయనని, దామచర్ల జనార్ధన్ అప్పులు ఎగ్గొడితే.. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మంత్రి విమర్శించారు.

కరోనా సమయంలో ఒంగోలులో రూ.కోటి సొంత డబ్బు ఖర్చు చేశానని... రోడ్లు మీద రోడ్లు వేసి టీడీపీ నేతలు దోచుకున్నారని బాలినేని ఆరోపించారు.  పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే.. కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని..  కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే, రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రిపీట్ అవుతుందంటూ మంత్రి జోస్యం చెప్పారు. 

click me!