రాజధాని మార్పుపై క్లారిటీ... మంత్రి బొత్స లిఖితపూర్వక ప్రకటన

By Arun Kumar P  |  First Published Dec 13, 2019, 5:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని  అమరావతి విషయంలో వైసిపి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో రాజధాని మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 


అమరావతి:  గతకొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై నెలకొన్న అనుమానాలను మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షిగా నివృత్తిచేశారు. శాసన మండలిలో టిడిపి ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానం చెప్పారు. రాజధానిని అమరావతి నుంచి ఎక్కడికీ మార్చడం లేదని లిఖితపూర్వకంగా మంత్రి సమాధానమిచ్చారు. దీంతో మొదటిసారి ప్రభుత్వం తరపున రాజధాని మార్పుపై స్పష్టమైన ప్రకటన వెలువడినట్లయింది. 

రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్ర ప్రజల్లో గందరగోళం  నెలకొన్న విషయం తెలిసిందే. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రాజధాని నిర్మాణ పనులను నూతన వైసిపి ప్రభుత్వం కొనసాగిస్తుందా అన్న అనుమానం మొదలయ్యింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అమరావతి గురించి పలుమార్లు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

ఇటీవల పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానంతో పోల్చడం వివాదాస్పదమయ్యింది. అలాగే చంద్రబాబు రాజధాని పర్యటన, జరిగిన  పరిణామాలు రాజకీయ  ప్రకంపణలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బొత్స అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనతో అందరి సందేహాలకు సమాధానం లభించాయి. 

read more పక్క రాష్ట్రంలో ఘటన... ఇక్కడ చట్టం... దమ్మున్న సీఎంకే సాధ్యం: కన్నబాబు

ఇదే సమావేశాల్లో ఓ శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు గతంలో బొత్స సమాధానం చెబుతూ రాజధానిపై గతంలో తాను చేసిన కామెంట్స్ కు వివరణ ఇచ్చాడు. తాను మొత్తంగా ఏం మాట్లాడానో వదిలేసి కేవలం రాజధానిని స్మశానంతో పోల్చానంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. 

''నేను రాజధానిని శ్మశానం అన్నానన్నారు అధ్యక్షా.... కానీ నేనేమన్నానో వాళ్లు తెలుసుకోవాలి అధ్యక్షా. ఆ రోజు అసలు నేనేమన్నానో ఈ సభ సమక్షంలో చెబుతున్నాను. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాజధాని పర్యటనకు వెళ్తారంట గదా అని ఓ విలేకరి అడిగాడు... అందుకు  సమాధానంగా ఏం వెళ్తాడయ్యా పచ్చని పొలాలు, సంవత్సరానికి మూడు పంటలు పండే భూములని నాశనం చేశారు. అక్కడి పరిస్థితులు అన్నీ తెలిసి ఇలా చేశారు... ఇప్పుడు చూస్తే ఆ ప్రాంతం శ్మశానవాటికలా తయారు చేశారు. 
 
చంద్రబాబు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కానీ ఐదువేల కోట్ల రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదు. రూ.840 కోట్లు రూపాయలు కన్సెల్టెంట్లకు కోసం ఎంఓయూలు మాత్రం చేశారు. రూ.320 కోట్లు ప్రజాధనాన్ని  దుర్వనియోగం చేశారు. 

read more అన్నోచ్చాడు... జగనన్న వచ్చాడన్న నమ్మకం కలిగింది...నాకే కాదు...: మంత్రి పుష్పశ్రీవాణి

వంద అడుగుల లోతుకు పునాది తీయవలిసిన పరిస్ధితులు రాజధాని ప్రాంతంలో ఉన్నాయి.  ఈ రకమైన పరిస్ధితులున్నాయని మాత్రమే తాను మాట్లాడాను. ఈ పరిస్ధితులను ఇప్పుడు వచ్చి ఏం చూస్తాడయ్యా అని మాత్రమే అన్నాను అధ్యక్షా... దాన్ని ఓ పత్రికలో వేరే అర్థాలు వచ్చేలా రాయించింది వీళ్లే అధ్యక్షా... ఇప్పుడు వీళ్లే మాట్లాడుతారు'' అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

''రాజధాని గురించి మాట్లాడుతున్నప్పుడు రాజధాని ఉంటాదా ఉండదా... దీనికి అనుమతి ఉందా లేదా అని డైరెక్టుగా అడగండి తప్పులేదు... దానికి సమాధానం చెప్తాం. కానీ ఇవాలొచ్చి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వచ్చి పర్మిషన్‌ ఇచ్చిందా అని అడుగుతారా. అధ్యక్షా గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు దీనికి సంబంధం లేదు. పర్మిషన్‌ ఇచ్చింది స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌  ఇంఫాక్ట్‌ ఎసెస్‌మెంట్‌ అధారిటీ (ఎస్‌ సి ఐ ఏ ఏ) అని గుర్తుపెట్టుకోవాలి. 

 ప్రతిపక్ష సభ్యులు అవన్నీ వదిలేసి ఏవేవో అడిగారు. కాబట్టి ఏదైతే అమరావతి నగరం ఉందో, ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చారో వాటిన్నంటికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారు కూడా చెప్పారు అవన్నీ డెవలప్‌ చేసి ఇవ్వాలనే  ఆలోచనతో ఉన్నామని. త్వరలోనే వారందిరికీ  డెవలప్‌ చేసి ప్లాట్లన్నీ ఇస్తామని తమరి ద్వారా చెపుతున్నాను.'' అని బొత్స వెల్లడించారు. 

click me!