వాస్తవం ఇదీ: జగన్‌కు లోకేష్ కౌంటర్

Published : Dec 13, 2019, 04:51 PM ISTUpdated : Dec 13, 2019, 04:58 PM IST
వాస్తవం ఇదీ: జగన్‌కు లోకేష్ కౌంటర్

సారాంశం

ఏపీ అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ కు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన గొడవకు సంబంధించి లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశాడు. 

అమరావతి: ఏపీ అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్‌తో గొడవ విషయంలో తమపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించి ఏపీ సీఎం వైఎస్ జగన్ బొక్కబొర్లాపడ్డారని మాజీ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

 

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా  లోకేష్ ఓ వీడియోను పోస్టు చేసి అసలు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశాడు. గురువారం నాడు అసెంబ్లీ గేటు వద్ద నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని మార్షల్స్ తో తాను మాట్లాడుతున్న విజువల్స్ ఉన్న వీడియోను నారా లోకేష్ పోస్టు చేశాడు.

తాను నోటికి నల్లబట్ట కట్టుకొని మార్షల్‌తో మాట్లాడుతున్నాడు. తమను లోపలికి వెళ్లేందుకు  అనుమతి ఇవ్వాలని లోకేష్ మాట్లాడారు. ఈ సమయంలో గేటు వద్ద తోపులాట చోటు చేసుకొంది. ఈ వీడియోను లోకేష్ పోస్టు చేశాడు.

Also Read: ఆ అధికారం జగన్‌కు లేదు: కృష్ణకిశోర్‌ వ్యవహారంపై బాబు కామెంట్

అసెంబ్లీలో  టీడీపీ సభ్యులు మార్లల్స్‌పై అసభ్యంగా మాట్లాడారని, దాడి చేశారని తమపై తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని లోకేష్ విమర్శలు గుప్పించారు. 

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు అధికార విపక్షాల మధ్య వాగ్యుద్దం జరిగింది. మార్షల్స్ ను చంద్రబాబునాయుడు బాస్టర్డ్ అన్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

మార్షల్స్ ను నెట్టివేశారని కూడ వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. చంద్రబాబునాయుడును క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు, మంత్రులు డిమాండ్ చేశారు. మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకొనే అధికారాన్ని స్పీకర్‌కు కట్టబెడుతూ ఏపీ అసెంబ్లీ శుక్రవారం నాడు తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

Also Read: నేను సర్వీసులో ఉంటే నీలాంటోడికి పాఠాలు చెప్పేటోడ్ని: అచ్చెన్నకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

PREV
click me!

Recommended Stories

22 AP Youth Rescued from Cyber-Slavery in Myanmar: కరెంటు షాక్ పెట్టేవాళ్ళు | Asianet News Telugu
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం