నీకే నోరు ఉందా.. మాకు లేదా: పవన్‌పై బొత్స సత్యనారాయణ ఫైర్

By Siva Kodati  |  First Published Nov 13, 2019, 5:01 PM IST

నీకే నోరు ఉందా.. మాకు లేదా.. ఊరుకుంటుంటే రోజు రోజుకి దారుణంగా మాట్లాడుతున్నావంటూ దుయ్యబట్టారు. పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తుంది.. ఏమి చూసుకుని అంత అహంకారమని బొత్స ప్రశ్నించారు.


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఫైరయ్యారు. ముఖ్యమంత్రిపై శాపనార్థాలు పెట్టడం సరికాదని హితవు పలికారు. అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... పవన్ కల్యాణ్ ఆక్రోశం దేనికోసమని.. రాజకీయ నాయకుడి లక్షణాలు పవన్‌లో లేవని సత్యనారాయణ ధ్వజమెత్తారు.

నీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవాలా... సామాన్యుల పిల్లలు చడవకూడదా అంటూ పవన్‌ను ప్రశ్నించారు. నీకే నోరు ఉందా.. మాకు లేదా.. ఊరుకుంటుంటే రోజు రోజుకి దారుణంగా మాట్లాడుతున్నావంటూ దుయ్యబట్టారు.

Latest Videos

undefined

పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తుంది.. ఏమి చూసుకుని అంత అహంకారమని బొత్స ప్రశ్నించారు. ఇంగ్లీష్ లేక మన పిల్లలు అనేక ఇబ్బంది పడుతున్నారని.. తాను కూడా ఇంగ్లీష్‌పై పట్టులేక ఎంతో ఇబ్బంది పడుతున్నానని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షలు జరిమానా: ఏపీ కేబినెట్ నిర్ణయం

ఇసుక మాఫియా పేరుతో టీడీపీ విడుదల చేసిన ఛార్జ్ సీట్ లో ఇష్టం వచ్చినట్లు రాశారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మా జిల్లాలో ఇసుక మాఫియా జరిగిందని నిరూపిస్తే తాను దేనికైనా నేను రెడీ అని మంత్రి సవాల్ విసిరారు.

మా కుటుంబం నుండే కాదు మండల స్థాయి వరకూ మా జిల్లాలో ఎలాంటి మాఫియా లేదని బొత్స స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షపైనా సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు కొంగ జపాలు ప్రజలందరికీ తెలుసునని.. ఐదేళ్లు ఇసుక మాఫియాను ప్రోత్సహించిన ఆయన ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజంగా అంత మంచి పాలన అందిస్తే 23 సీట్లే ఎందుకు వస్తాయని ఆయన నిలదీశారు.

Also Read:Pawan: జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్ శాపనార్థాలు

రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు రోజు ఏదొకటి చేస్తుంటారని.. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 

అమరావతి విషయంలో సింగపూర్ కంపెనీతో ఒప్పందం రద్దు మ్యూచువల్ గానే జరిగిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. . ఇప్పటి వరకూ అయిన ఖర్చుపై అడిట్ చేసి ఎవరు భరిస్తారో తేలుస్తామన్నారు.

సింగపూర్ కంపెనీతో ఒప్పందం రద్దు అంటే చంద్రబాబు, లోకేష్ తెగ ఉత్సహ పడిపోతున్నారని బొత్స ఆరోపించారు. ఇటీవలి కాలంలో లోకేష్ ట్విట్టర్ వీరుడైపోయాడని.. డైరెక్టుగా మాట్లాడలేక ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నాడని సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

స్విజ్ ఛాలెంజ్ విధానాన్ని అందరూ వ్యతిరేకించారని చివరికి న్యాయస్థానాలు సైతం వద్దని చెప్పాయని గుర్తు చేశారు. స్టార్టప్ ఏరియాని వేరే కంపెనీతో ఒప్పందం చేసుకునే ఆలోచన తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని.. త్వరలోనే ఖచ్చితమైన పారిశ్రామిక విధానం తీసుకురాబోతున్నామని బొత్స తెలిపారు.

 

 

 

click me!