అక్రమ గనుల తవ్వకం.. పెద్దిరెడ్డిపై విమర్శలు సరికాదు, త్వరలోనే విచారణ: చంద్రబాబుకు మంత్రి బొత్స కౌంటర్

By Siva KodatiFirst Published Jan 9, 2022, 9:07 PM IST
Highlights

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబుపై (chandrababu)  మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana)  .సీఎంగా ఏం చేశారో చంద్రబాబు ప్రజలకు వివరిస్తే బాగుండేదని.. మంత్రి పెద్దిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బొత్స హితవు పలికారు. రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని.., చంద్రబాబు సత్తా ఏంటో తెలుస్తుందంటూ దుయ్యబట్టారు. 

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబుపై (chandrababu)  మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana)  . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోగొట్టుకున్న చోట వెతుక్కోవటం సాధారణం.. ప్రస్తుతం చంద్రబాబు కుప్పంలో (kuppam) అదే చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. సీఎంగా ఏం చేశారో చంద్రబాబు ప్రజలకు వివరిస్తే బాగుండేదని.. మంత్రి పెద్దిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బొత్స హితవు పలికారు. రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని.., చంద్రబాబు సత్తా ఏంటో తెలుస్తుందంటూ దుయ్యబట్టారు. మూడు రాజధానుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

కుప్పంలో అక్రమ గనుల తవ్వకాలపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. అయితే అది న్యాయవిచారణా? అధికారుల విచారణా? అనేది త్వరలో నిర్ణయిస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని అంశాలపై న్యాయవిచారణ చేశారని బొత్స ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై త్వరలో చర్చిస్తామని... సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని సత్యనారాయణ హామీ ఇచ్చారు.

ఇకపోతే శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (peddireddy rama chandra reddy) మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్ర‌మ మైనింగ్ చేసిన‌ట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. చంద్ర‌బాబు సీనియర్ శాస‌న‌స‌భ్యుడిగా ఉండి జిల్లాకు ఏం చేశాడ‌ని పెద్దిరెడ్డి ప్ర‌శ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాల‌ని క‌ల‌లు క‌న్నాడ‌ని చెబుతున్నార‌ని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశార‌ని ఆయన ప్ర‌శ్నించారు.  ఐదేళ్లలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు దేవుడు అయ్యార‌ని, చంద్ర‌బాబు చిత్తూరు జిల్లాలో (chittoor district) పుట్ట‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌ంటూ దుయ్యబట్టారు. చంద్ర‌బాబు సీఎం‌గా ఉన్న‌ప్పుడు మైనింగ్ రాయ‌ల్టీపై క‌న్సెష‌న్ ఎందుకు ఇచ్చార‌ని రామచంద్రారెడ్డి ప్ర‌శ్నించారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోయారు కాబ‌ట్టే చంద్ర‌బాబుకు ఈ బాధ ఉంద‌ంటూ ఆయన దుయ్యబట్టారు. చంద్ర‌బాబు దుష్ట‌పాల‌న‌ను వ‌దిలించుకోవ‌డానికి 151 సీట్లు వైసీపీకి ఇచ్చార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా కుప్పంలో ప‌ర్యటిస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబును తప్ప‌కుండా ఓడిస్తామ‌ని, ఇది త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు.  బాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 

click me!