ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,257 కరోనా కేసులు.. ఆ జిల్లాల్లోనే ఎక్కువగా కేసులు..

Published : Jan 09, 2022, 05:16 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,257 కరోనా కేసులు.. ఆ జిల్లాల్లోనే ఎక్కువగా కేసులు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య (Corona cases In AP) రోజు రోజుకి భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  20,78,964కి చేరినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య (Corona cases In AP) రోజు రోజుకి భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  20,78,964కి చేరినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. తాజాగా 38, 479 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా 1,257 మంది కరోనా నిర్దారణ అయినట్టుగా వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనాతో విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజాగా చోటుచేసుకన్న రెండు మరణాలతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,505కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 140 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20,59,685కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,774 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో 3,16,05,951 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

గత 24 గంటల్లో నమోదైన కొత్త కోవిడ్ కేసులను బట్టి చూస్తే.. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కరోనా విజృంభణ అధికంగా ఉంది. అనంతపురం జిల్లాలో 138, చిత్తూరు జిల్లాలో 254, తూర్పు గోదావరి జిల్లాలో 93, గుంటూరు జిల్లాలో 104, కడప జిల్లాలో 20, కృష్ణా జిల్లాలో 117, కర్నూలు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 103, ప్రకాశం జిల్లాలో 40, శ్రీకాకుళం జిల్లాలో 55, విశాఖపట్నం జిల్లాలో 196, విజయనగరం జిల్లాలో 83, పశ్చిమ గోదావరి జిల్లాలో 25 కరోనా కేసులు నమోదయ్యాయి. 

 

ఆంధ్రప్రదేశ్‌లో 28 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 9 మంది కోలుకున్నట్టుగా పేర్కొంది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,623 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,409 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వివరాలను వెల్లడించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 513 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో  ఉంది. 

ఇక, భారత్‌లో గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది. నిన్న 40,863 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603కు చేరింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 5,90,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 10.21 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 6.77 శాతంగా ఉంది. మరోవైపు కరోనా రికవరీ రేటు.. 96.98 శాతంగా ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour