ఎన్డీఏలోకి వైసీపీ.. ఓ వర్గం ప్రచారమే, నేను అనలేదు: బొత్స

By Siva KodatiFirst Published Feb 16, 2020, 4:44 PM IST
Highlights

బీజేపీతో వైసీపీ పొత్తుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్-మోడీ భేటీని కొన్ని పత్రికల్లో హైలెట్ చేశారని బొత్స మండిపడ్డారు.

బీజేపీతో వైసీపీ పొత్తుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్-మోడీ భేటీని కొన్ని పత్రికల్లో హైలెట్ చేశారని బొత్స మండిపడ్డారు.

ఎన్డీఏతో సఖ్యతను అంటకట్టి వైసీపీకి ప్రజలను దూరం చేయాలని కొందరు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన ఎద్దేవా చేశారు. ఓడినప్పటి నుంచి వైసీపీపై టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని బొత్స ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా తాను ఈనాడు అధినేత రామోజీరావుకు లేఖ రాశానని మంత్రి తెలిపారు.

Also Read:బీజేపీతో వైసీపీ జత కలిస్తే జనసేన కటీఫ్: తేల్చేసిన పవన్

ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు చెప్పారని బొత్స ప్రశ్నించారు. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సైతం కలిసేది లేదంటున్నారని.. తాము కలుస్తామని చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ-బీజేపీ కలిస్తే తాను బయటకు వెళ్లిపోతానని పవన్ అంటున్నారని.. నిన్ను ఎవరు కలవమన్నారు, ఎవరు వెళ్లామన్నారంటూ బొత్స సెటైర్లు వేశారు.

తాను అనని మాటను ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని.. ఇదంతా చంద్రబాబును రక్షించేందుకేనంటూ బొత్స ఆరోపించారు. యనమల రామకృష్ణుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌పై దాడులకు సంబంధించి ఐటీ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని బొత్స చెప్పారు. యనమల పరువు నష్టం దావా వేస్తామంటున్నారు దేని కోసం..? మీ ప్రముఖ వ్యక్తి దగ్గర రూ.2 వేల కోట్లు సీజ్ చేశామని ఐటీ శాఖ చెప్పినందుకా అని సత్తిబాబు ప్రశ్నించారు.

Also Read:వైసీపీపై చట్టపరమైన చర్యలు: బాబు మాజీ పీఎస్ ఇంట్లో సోదాలపై యనమల

చిన్న విషయాలకే హడావిడి చేసే చంద్రబాబు, లోకేశ్‌లు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని బొత్స నిలదీశారు. ఐటీ దాడులు ఏ కార్పోరేట్ కార్యాలయాల్లోనో జరిగితే అది సర్వసాధారణమని కానీ అధికారి ఇంటిపై సోదాలు జరిగడం అది మామూలు విషయం కాదన్నారు. 

click me!