అసెంబ్లీ ముందుకు మళ్లీ రాజధానుల బిల్లు.. ఈ సారి మరింత సమగ్రంగా: జగన్

By Siva Kodati  |  First Published Nov 22, 2021, 3:22 PM IST

ఈ ప్రాంతంలోనే తన ఇల్లు వుందని.. తనకు ఇక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదని జగన్ స్పష్టం చేశారు. మెరుగైన బిల్లు అతి త్వరలో అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.


ఈ ప్రాంతంలోనే తన ఇల్లు వుందని.. తనకు ఇక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదని జగన్ స్పష్టం చేశారు. మెరుగైన బిల్లు అతి త్వరలో అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్ధితుల్లో మూడు రాజధానుల (Three Capital Bill) నిర్ణయం వచ్చిందో అందరికీ తెలుసునని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy). మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడంపై అసెంబ్లీలో (ap assembly) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు వుండేదని , ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు వుండేదని జగన్ గుర్తుచేశారు.

తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధాని, గుంటూరు నుంచి హైకోర్టు హైదరాబాద్‌కు తీసుకెళ్లారని ఆయన అన్నారు. ఆ సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీబాగ్ ఒడంబడిక (sribagh agreement) చేసి .. రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారని సీఎం తెలిపారు. అనంతర పరిణామాలతో అమరావతిలో రాజధాని పెట్టడానికి దారి తీసిన పరిణామాలను జగన్ గుర్తుచేశారు. శ్రీకృష్ణ కమిటీ నిబంధనలను విరుద్ధంగా రాజధాని నిర్ణయం జరిగిందని.. కానీ 50 వేల ఎకరాల్లో చంద్రబాబు రాజధాని పెట్టాలని నిర్ణయించారని సీఎం అన్నారు.

Latest Videos

ALso Read:జగన్ సర్కార్ కీలక నిర్ణయం: అసెంబ్లీకి మూడు రాజధానుల చట్టం ఉప సంహరణ బిల్లు

విస్తృత, విశాల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయం  తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు  ఆమోదించిన వెంటనే ప్రక్రియ ప్రారంభమై వుంటే మంచి ఫలితాలు వచ్చి వుండేవని జగన్ అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టామని సీఎం స్పష్టం చేశారు. 3 రాజధానులపై మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని చట్టాల ఉపసంహరణ తాత్కాలికమేనని ఆయన చెప్పారు. 

అమరావతిలో రాజధాని, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్లు ఖర్చవుతుందని సీఎం అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా అని ఆయన నిలదీశారు. ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ అని.. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయని జగన్ చెప్పారు. వాటికి అదనపు హంగులు దిద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. 

click me!