ఎంక్వైరీ వేయమన్నారుగా... నిర్దోషులమని నిరూపించుకోండి: టీడీపీ నేతలకు బొత్స సవాల్

By Siva KodatiFirst Published Feb 22, 2020, 4:22 PM IST
Highlights

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరపాలని ప్రతిపక్షం అడిగినందునే సిట్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరపాలని ప్రతిపక్షం అడిగినందునే సిట్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఈఎస్ఐ స్కాంపై విచారణ జరుపుతామంటే ప్రధాని పేరును బయటకు లాగుతున్నారని ఆయనేమైనా ఫలానా కంపెనీకి ఇవ్వమని చెప్పారా అంటూ బొత్స ప్రశ్నించారు.

విచారణలో నిర్దోషిత్వం నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈఎస్ఐ స్కామ్‌పై విచారణ చేస్తామనేగానే బీసీలను వేధిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారని సత్యనారాయణ ధ్వజమెత్తారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే తేడా ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

Also Read:వైఎస్ ఎన్నో ఎంక్వైరీలు వేసి ఏం సాధించారు.. ఇప్పుడు అంతే: సిట్‌పై లోకేశ్ వ్యాఖ్యలు

జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈ నెల 24న ప్రారంభిస్తామని, ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం తాము ఎక్కడా బలవంతపు భూసేకరణ చేయలేదన్నారు.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై పదే పదే చెప్పానని.. ఒక్క ఆర్కిటెక్చర్ ఫీజు కోసమే రూ.842 కోట్లు నిర్ణయించారని బొత్స ఆరోపించారు. అమరావతిలో భూ కేటాయింపులు శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read:నా పేరు ఎక్కడా లేదు, ఏ విచారణకైనా సిద్ధం: ఈఎస్ఐ స్కామ్ పై పితాని

తనకు ఏమాత్రం సంబంధం లేని వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ విచారణ వేశారని సత్తిబాబు మండిపడ్డారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు దొరికాయని ఐటీ శాఖ స్వయంగా చెప్పిందని బొత్స గుర్తుచేశారు. ప్రభుత్వోద్యోగదిపై ఐటీ దాడులు జరగటం ఇదే తొలిసారన్నారు. 
 

click me!