నూజివీడు ట్రిపుల్ ఐటీ: అమ్మాయిల హాస్టల్‌లో యువకుడు, రోజంతా అక్కడే

Siva Kodati |  
Published : Feb 22, 2020, 03:09 PM ISTUpdated : Feb 22, 2020, 03:16 PM IST
నూజివీడు ట్రిపుల్ ఐటీ: అమ్మాయిల హాస్టల్‌లో యువకుడు, రోజంతా అక్కడే

సారాంశం

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. విద్యార్ధినుల వసతి గృహంలో ఓ యువకుడు ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. విద్యార్ధినుల హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. విద్యార్ధినుల వసతి గృహంలో ఓ యువకుడు ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. విద్యార్ధినుల హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం.. అతను లేడిస్ హాస్టల్‌లోకి ప్రవేశించడానికి సాయం చేసిన ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేసింది. అమ్మాయిలు ఉండాల్సిన హాస్టల్‌లో యువకుడు ఉండటం క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. 

Also Read:నా పేరు ఎక్కడా లేదు, ఏ విచారణకైనా సిద్ధం: ఈఎస్ఐ స్కామ్ పై పితాని

ఆ యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి ఐఐఐటీలో ఒక ఫెస్ట్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఓ విద్యార్ధి పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.

కిటికీ ఊచలను విరగ్గొట్టి అతను గదిలోకి ప్రవేశించినట్లుగా సమాచారం. అతనిని లోపలే ఉంచే ఆ గదికి చెందిన విద్యార్ధినులు బయటకు వెళ్లినట్లుగా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం గుర్తించింది.

Also Read:ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు.. పెళ్లికొప్పుకోలేదని..

ఈ వ్యవహారంతో ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపం మరోసారి వెలుగుచూడటంతో యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఇప్పటికే విద్యార్ధుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu