పేదలకు ప్రయోజనం కలిగించేందుకే వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం ప్రవేశపెట్టామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది బలవంతపు పథకం కాదని.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తింపజేస్తామని బొత్స తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ పథకం చేపట్టారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు
పేదలకు ప్రయోజనం కలిగించేందుకే వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం ప్రవేశపెట్టామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. (botsa satya narayana) బుధవారం అమరావతిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. లబ్ధిదారులకు గృహహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇది బలవంతపు పథకం కాదని.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే పథకం వర్తింపజేస్తామని బొత్స తెలిపారు. పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ పథకం చేపట్టారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వివాదాస్పద ఆదేశం ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వంపై టీడీపీ కుట్ర చేస్తోందని బొత్స సత్యనారాయణ ఆరోపపించారు. అధికారులు ఎవరూ ప్రజలను బలవంతం చేయరని.. పేదలపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బొత్స మండిపడ్డారు.
సొంత బొమ్మాళిలో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సర్క్యులర్ కి ప్రభుత్వ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన ఎందుకు సర్క్యులర్ ఇచ్చాడో తెలియదని.. చర్యలు తీసుకోడానికి అధికారులు ఆదేశించారని మంత్రి చెప్పారు. సెక్రటరీ సర్క్యులర్ ఇవ్వడం.. వెంటనే లోకేష్, అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం చూస్తుంటే దీని వెనుక వీరిద్దరూ ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయన్నారు. నీచ రాజకీయాల కోసం సెక్రెటరీని లోబర్చుకుని ఇలాంటి సర్క్యులర్ లు ఇప్పించారని బొత్స ఆరోపించారు. పేదలకు ఇళ్ళు సొంతమవ్వడం టీడీపీకి ఇష్టం లేదని.. అందుకే దృష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజల్ని మోసం చేసాడు కనుకే ప్రజలు బుద్దిచెప్పారని... ఆయనలాగా ప్రజల్ని దగా చేసే అలవాటు సీఎం జగన్‌కి లేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
undefined
కాగా.. వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చంటూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట భారీ దోపీడీకి జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ తప్పనిసరి కాదంటూనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ''జగన్ రెడ్డి జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడు. ఎన్టీఆర్ గారి హయాం నుండి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషనంటూ రూ.1500 కోట్లు కొట్టేసే స్కెచ్ వేసారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టొద్దు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం'' అని nara lokesh హామీ ఇచ్చారు.
also Read:టిడిపి అధికారంలోకి రాగానే... వారికి ఉచిత రిజిస్ట్రేషన్లు: నారా లోకేష్ హామీ
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి జగన్ సర్కార్ వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ఇళ్లపై హక్కులు కల్పించేందుకు Jagananna Permanent House Rights Scheme ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్ సొమ్మును చెల్లించి గతంలో వివిధ ప్రభుత్వాల హయాంలో పొందిన ఇళ్లపై శాశ్వత హక్కులు పొందవచ్చని ప్రభుత్వం సూచిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో one time settlement అర్హుల జాబితా ప్రదర్శించనున్నట్లు... పేరు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు వుంటాయని అధికారులు తెలిపారు. అయితే సొంతింటి కల పేరిట ప్రజల నుండి వందల కోట్లు దోచేయాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని టిడిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే tdp అధికారంలోకి రాగానే ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు