అమరావతి స్కాం పై ఆధారాలు...ప్రభుత్వానికి కేబినెట్ కమిటీ నివేదిక: మంత్రి అనిల్

By Arun Kumar PFirst Published Sep 15, 2020, 12:04 PM IST
Highlights

అమరావతి నిర్మాణం విషయంలో కుంభకోణం జరిగిందని రుజువు అయ్యిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 

అమరావతి విషయంలో కుంభకోణం జరిగిందని రుజువు అయ్యిందని... ఇన్ సైడెడ్ ట్రేడింగ్ పై వైసిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీలో ఇదే తేలిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్  పేర్కొన్నారు. సబ్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చామని... ఏసీబీ విచారణ ప్రారంభం అయిందన్నారు. ఎవరెవరు అవినీతి చేశారో అందరి పేర్లు బయటపడతాయని...తప్పు చెయ్యకపోతే సీబీఐ విచారణ వెయ్యమని కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. 

ఏ విచారణ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేష్ కు లేదని...తప్పు చేశారు కనుకే టీడీపీ నేతలు కంగారు పడుతున్నారని ఆరోపించారు. తాము సీబీఐ తో విచారణ  జరిపించాలని కేంద్రాన్ని కోరామని... ఆ విచారణలో అన్ని తేలుతాయన్నారు. తప్పు చేసినవారి పేర్లు అసెంబ్లీ లో బుగ్గన చదివి వినిపించారని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. 

''మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు సీఎం అన్ని చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేనంతగా పంటలు పండాయి. రైతులను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వర్షాల వలన రైతుల నుంచి పంట కొనుగోలు చెయ్యడానికి అడ్డంకి ఏర్పడింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు అధికారులు, మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. రైతులకు హామీ ఇస్తున్నాం, పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది'' అని మంత్రి స్పష్టం చేశారు. 

read more  రాజధాని భూముల స్కాం: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు సహా 12 మందిపై ఏసీబీ కేసు

''రైతులను చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకోవడం కోసం అన్ని చర్యలు చేపడుతున్నాం.  4వేల కోట్ల పౌర సరఫరాల శాఖ నిదులను చంద్రబాబు పక్కదారి పట్టించింది అవునో, కాదో ఆయనే చెప్పాలి'' అని సూచించారు. 

''రైతుల పట్ల మా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించదు. రైతులు ఆందోళనకు గురి కావద్దు. టీడీపీ నేతలే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.  టీడీపీ పెద్దలు రాజధాని  గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారు.  టీడీపీ ప్రభుత్వమే ఇన్సైడ్ ట్రేడింగ్ ని ప్రోత్సహించింది. ఎపి ప్రభుత్వం  సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి  రాసిన లేఖకు తాము సహకరిస్తామని లోకేష్,చంద్రబాబు  కేంద్రానికి లేఖ రాయండి'' అని సూచించారు. 

''రాజధాని గ్రామాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముందుగానే లీకులు ఇచ్చి భూములు  కొనుగోలు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ, దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐకి అప్పగిస్తున్నాం. ఎవరెవరు ఇన్సైడ్ ట్రేడింగ్ ఎవరెవరు ఉన్నారో అనేది ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రకటించాం. భూములు అవకతవలలో ఎవరు ఉన్నా చర్యలు తప్పవు'' అని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. 
 

click me!