ప్యాంట్ జిప్ తీసి చూపించానా... : మంత్రి అనిల్ కౌంటర్

By Siva KodatiFirst Published Jun 18, 2020, 5:12 PM IST
Highlights

సంఖ్యా బలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వనియకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు

సంఖ్యా బలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వనియకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

సభలో విద్వంసం సృష్టిస్తామని యనమల అనడం దారుణమని అనిల్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కక్ష పూరితంగా వ్యవహరించారని.. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక మండలిని అడ్డుపెట్టుకుని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

Also Read:మంత్రుల దాడులు తట్టుకొని పోరాటం: ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

రూల్స్ కి విరుద్ధంగా లోకేష్ సభలో వీడియోలు తీస్తున్నాడని... దీనిని అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని అనిల్ ఫైరయ్యారు. దాడి చేసింది వాళ్ళు.. భూతులు తిట్టామని చివరికి మాపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.

సమయం ఉన్నా నిరవధిక వాయిదా ఎందుకు వేశారని మంత్రి నిలదీశారు. చంద్రబాబు బతుకే కుట్ర పూరితమని, చీకటి రాజకీయాలు, చీకటి ఒప్పందాలేనని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.

సంఖ్యా బలం ఉంటే ఏమైనా చేయొచ్చనని అనుకుంటున్నారా.. మీ బలం ఇంకెన్నాళ్లు ఉంటుంది... మీకున్న బలం తాత్కాలికమేనని ఆయన జోస్యం  పలికారు. ద్రవ్య వినిమియ బిల్లును అడ్డుకున్న దుర్మార్గపు ప్రతిపక్షంగా చరిత్రలో నిలిచిపోతారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.

Also Read:టీడీపీ ఆఫీసులో వ్యూహాం... కౌన్సిల్‌లో అమలు: మండలి పరిణామాలపై బొత్స సీరియస్

మహిళల ముందుకు వెళ్లి షర్ట్ ఇప్పి జిప్ తీసి చూపించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైర్మన్ మీ మనిషే కదా వీడియోలు విడుదల చేస్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయని మంత్రి సవాల్ విసిరారు.

దీనిపై ఛైర్మన్ దగ్గరికి వెళ్దామన్న అనిల్ కుమార్ ... నిరూపించలేకపపోతే రాజీనామా చేస్తానని లేఖలు ఇవ్వాలని అనిల్ కుమార్ అన్నారు. దమ్ముంటే అశోక్ బాబు, రాజేంద్రప్రసాద్, లోకేశ్ తన సవాల్‌ను స్వీకరించి ఛైర్మన్ దగ్గరకు రావాలన్నారు. 

click me!