పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు స్టాండ్ ఏంటి..? స్పందించే దమ్ముందా: మంత్రి అనిల్ సవాల్

By Arun Kumar PFirst Published May 18, 2020, 11:10 AM IST
Highlights

పోతిరెడ్డిపాడు విషయంలో ఇరు తెలుగురాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దానిపై తన స్టాండ్ ఏంటో చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిలదీశాారు. 

నెల్లూరు: తెలుగురాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం కొనసాగుతుంటే కనీసం దీనిపై స్పందించడానికి కూడా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమలకు దమ్ములేదని నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు, ఉమలు పోతిరెడ్డిపాడు పై వాళ్ల స్టాండ్  ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 

''నేనెప్పుడూ భూతులు మాట్లాడే మంత్రిని కాను. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా భూతులు మాట్లాడేది మీరే. నా గొంతు బిగ్గరగా ఉంటుంది అంతదానికి భూతులు మాట్లాడాను అనడం హాస్యాస్పదం'' అంటూ టిడిపి నాయకుల ఆరోపణలకు వివరణ ఇచ్చారు. 

''ఒక్క నెల్లూరు జిల్లాలోనే 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాము. రెండో పంటకు 2 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు అందించాము. దీనిపై ఏదైనా అనుమానం ఉంటే నెల్లూరు టిడిపి నాయకులను కనుక్కోండి'' అని సూచించారు. 

read more  పప్పూ! మీ నాన్నను వదిలేయ్!!: నారా లోకేష్ పై విజయసాయి రెడ్డి

''నేను ఏ ఒక్క కాంట్రాక్టర్ ని పిలిచి ఏ రకంగానూ మాట్లాడలేదు. గత ఐదు సంవత్సరాలు గా ఇరిగేషన్ అధికారులను, కాంట్రాక్టర్లను వాడుకున్నది మాజీ మంత్రి ఉమనే. మీలా పొలవరంకి వెళ్లిన ప్రతీసారి లక్షలు ఖర్చు పెట్టే  నైజం కాదు నాది. పదవి కోసం ఎవరినో చంపేశారు అని కృష్ణా జిల్లా మొత్తం చెప్పుకుంటోంది'' అని విమర్శించారు. 

''రాయలసీమ ద్రోహులు టిడిపి వారే. వారికి మీడియా ముందుకు వచ్చే దమ్ములేకే జూమ్ యాప్ అడ్డంపెట్టుకుని మట్లాడుతున్నారు. ఇక కరోనాకు టీకాలు వచ్చే వరకు బయటికి రామన్నట్లుగా ఇప్పటికే ఇంట్లోనే దాక్కుని వున్నారు చిన్న బాబు,పెద్ద బాబు(లోకేశ్, చంద్రబాబు). దమ్ముంటే బయటకు రావాలి. యాప్ లు, జూమ్ యాప్ లు అడ్డం పెట్టుకొని మాట్లాడటం కాదు'' అని ఉమ సవాల్ విసిరారు. 

click me!