అతి తీవ్రంగా మారిన ఆంఫన్ తుఫాను: అధికారులు అప్రమత్తం

By telugu teamFirst Published May 18, 2020, 8:29 AM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫన్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఒడిశా, బెంగాల్ లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫన్ తుఫాను తాజాగా అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాను క్రమంగా బలపడుతూ పెను తుఫానుగా మారనుంది. ఆ తర్వాత నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఈశాన్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులను మత్స్యకారులను హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేసారు. 

ప్రస్తుతం ఆంఫన్ తుఫాను పారాదీప్ దక్షిణ దిశగా 820 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని దిగా ప్రాంతానికి దక్షిణ నైరుతి దిసగా 980 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని కెఫాపుర ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య క్రమంగా బలహీనపడి తుఫాను తీరదాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒడిశా,  పశ్చిమ బెంగాల్ లపై తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఈ నెల 19, 20 తేదీల్లో ఉత్తర, దక్షిణ 24 పరగణా జిల్లాలు, పశ్చిమ, తూర్పు మిడ్నాపూర్, కోల్ కతా, హుగ్లీల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

click me!