కరోనా రోగి మృతదేహానికి అంత్యక్రియలను అడ్డుకొన్న కడప జిల్లా వాసులు

By narsimha lodeFirst Published May 18, 2020, 10:48 AM IST
Highlights

కడప జిల్లా నందలూరు మండలం అడపూరులో కరోనా రోగి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకొన్నారు. గ్రామంలోకి డెడ్ బాడీని తీసుకు రాకుండా గ్రామస్తులు అడ్డు పడ్డారు.

కడప: కడప జిల్లా నందలూరు మండలం అడపూరులో కరోనా రోగి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకొన్నారు. గ్రామంలోకి డెడ్ బాడీని తీసుకు రాకుండా గ్రామస్తులు అడ్డు పడ్డారు.

కడప జిల్లా నందలూరు మండలం అడవూరుకు చెందిన వ్యక్తి పుణెలో మృతి చెందాడు. కరోనా వైరస్ సోకడంతోనే ఆయన మరణించినట్టుగా అధికారులు ధృవీకరించారు. అంబులెన్స్ లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

అయితే ఈ డెడ్ బాడీని గ్రామస్తులు మాత్రం గ్రామంలోకి రాకుండా అడ్డుచెప్పారు. అంబులెన్స్ ను గ్రామంలోకి రాకుండా ఉండేందుకు వీలుగా రోడ్డుపై ముళ్ల కంచె వేశారు. 

also read:ఏపీపై కరోనా పంజా: 24 గంటల్లో 25 కేసులు, మొత్తం 2330కి చేరిక

కరోనా రోగి అంత్యక్రియలను గ్రామంలో నిర్వహిస్తే తమకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళనతో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే అంత్యక్రియల నిర్వహణకు అడ్డుచెబుతున్నారు. గ్రామస్తులకు నచ్చచెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 2330 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
 

click me!