సంజయ్ గాంధీ దగ్గర బ్రోకర్ పనులు .. చిట్టా విప్పితే ఉరేసుకుంటావ్ : చంద్రబాబుకు అంబటి వార్నింగ్

By Siva KodatiFirst Published Nov 30, 2022, 8:51 PM IST
Highlights

తనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. నోరు జారితే ఉరేసుకుని చచ్చే విషయాలు బయటపెడతానని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తనను గంట, అరగంట మంత్రి అంటున్నారని ఫైరయ్యారు. చంద్రబాబుకు సంస్కారం వుందా.. యూత్ కాంగ్రెస్ నేతగా సంజయ్ గాంధీ దగ్గర ఆయన ఎన్ని బ్రోకర్ పనులు చేశాడో తన దగ్గర చిట్టా వుందన్నారు. తాను సంస్కారాన్ని పక్కనబెట్టి మాట్లాడితే.. చంద్రబాబు ఉరేసుకుంటాడని అంబటి హెచ్చరించారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని.. నోరు జారితే ఉరేసుకుని చచ్చే విషయాలు బయటపెడతానని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. 

అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చంద్రబాబు మాట్లాడుతూ.. నను, లోకేష్  ను కూడా చంపేస్తారని  వైసీపీ నేతలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లు తల్చుకొంటే  బాబాయిని  చంపినట్టుగా  తమను చంపుతారని చంద్రబాబు పరోక్షంగా  జగన్ పై ఆరోపణలు చేశారు. మొద్దుశ్రీనుని మా ఇంటికి పంపించే వారమని  రాయలసీమలో ఒకరు అంటున్నారని  ఇటీవల రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు  చేశారు.

ALso REad:కాటికి కాలు చాచినోడిని ఎవరైనా చంపుతారా : చంద్రబాబుకు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కౌంటర్

జగన్ కు పోలీసులుంటే తనకు ప్రజలున్నారన్నారు. చివరి అవకాశం తనకు కాదు, ప్రజలకు అని  చంద్రబాబు చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని... మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం  ఉండదని  చంద్రబాబు చెప్పారు. తనకేం కొత్త చరిత్ర అవసరం  లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని  ఎవరు ఎందుకు చంపారో  జగన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. సాక్షులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ మీటింగ్ లకు రావొద్దని బెదిరిస్తున్నారని.. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ధైర్యంగా  ముందుకు రావాలని.. పోలవరానికి కేంద్రమే డబ్బులిస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా  కూడా  ఈ ప్రాజెక్టును నాశనం  చేశారన్నారు. 

బాబాయిని చంపినంత  సులువుగా  తనను చంపొచ్చనుకొంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు లోకేష్ ను కూడా లక్ష్యంగా  చేసుకున్నారని ఈ తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు తేల్చి చెప్పారు. దెందులూరు లండన్ బాబు శాశ్వతంగా లండన్  పోతాడని  చంద్రబాబు చెప్పారు. కోతలతో విద్యాదీవెనను అమలు చేస్తున్నారని  జగన్ పై మండిపడ్డారు. రివర్స్ టెండర్ అంటూ పోలవరాన్ని  గోదావరిలో ముంచేశారని దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్  ఎక్కడుందో  చెప్పే పరిస్థితి లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇంకా  పునరావాసం దక్కలేదని చంద్రబాబు చెప్పారు. గోదావరి జిల్లాల్లో  పంట విరామం ప్రకటించే దుస్థితికి తీసుకువచ్చారని  చంద్రబాబు జగన్  సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  రైతుల నెత్తిన రూ. 2.75 లక్షల తలసరి అప్పు ఉందని... ఏదీ జరిగినా దానికి తానే బాధ్యుడినని  వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. 

click me!