జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలు.. మాకు చెప్పే పనిలేదా : ఏపీ డీజీపీ గుస్సా, మెమో జారీ

By Siva KodatiFirst Published Nov 30, 2022, 5:55 PM IST
Highlights

జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లడంపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఒక్క మాటైనా చెప్పకుండా .. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ బాసుల మధ్య వివాదం రాజుకుంది. జిల్లా ఎస్పీలకు నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు . ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని మెమో జారీ చేశారు. డీజీపీ అనుమతి లేకుండా జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎలా ఆదేశాలు జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. డీజీపీ ఆఫీస్ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఆదేశాలు పాటించొద్దని ఎస్పీలకు సూచించారు రాజేంద్రనాథ్ రెడ్డి. నేరుగా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయొద్దని, ముందుగా డీజీపీ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వాలని ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేశారు రాజేంద్రనాథ్ రెడ్డి. 

click me!