ఆధార్ కార్డ్ అడిగితే పారిపోయారు.. వాళ్లు రైతులేనా, అంతా దోపిడీ దొంగలే : అంబటి రాంబాబు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 22, 2022, 3:45 PM IST
Highlights

అమరావతి రైతులు పాదయాత్రకు విరామం ప్రకటించడంపై సెటైర్లు వేశారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. ఆధార్ కార్డ్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ యాత్ర అని... పాదయాత్రలో రైతులు ఎవ్వరూ లేరని.. దోపిడీ దొంగలున్నారని ఆరోపించారు మంత్రి

అమరావతి రైతుల పాదయాత్రపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పాదయాత్రకు శాశ్వతంగా విరామం ఇచ్చారని ఎద్దేవా చేశారు. సూర్య దేవాలయానికి వెళ్లే అర్హత వారికి లేదన్నారు. పాదయాత్రలో రైతులు ఎవ్వరూ లేరని.. దోపిడీ దొంగలున్నారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ నాలుగో పెళ్లి తర్వాతే పోలవరం పూర్తి చేస్తామన్న వ్యాఖ్యలకు కూడా మంత్రి వివరణ ఇచ్చారు. జనసేన కార్యకర్తలు కొంటే ప్రశ్న వేశారని.. అందుకే అలా సమాధానం చెప్పానని అంబటి చెప్పారు. అమరావతి రైతులది ఫేక్ యాత్ర అని తేలిపోయిందని... ఆధార్ కార్డ్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ యాత్ర అంటూ రాంబాబు సెటైర్లు వేశారు. 

ఇదిలా ఉంటే.. తాము చేపట్టిన పాదయాత్రను అడ్డుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో 600 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతించిన వారిని మినహాయించి ఎవరినీ అనుమతించవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. 

ALso REad:పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది.. అంబటి రాంబాబు సెటైర్లు..

అలాగే ప్రత్యర్థి వర్గానికి చెందిన ఏ వర్గానికి అయినా పాదయాత్రకు సమీపంలో ఉండకుండా అనుమతులు ఇచ్చేటపుడు చూసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో నాలుగు వాహనాలకు మించి అనుమతించరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇక, రైతుల పాదయాత్రకు సంఘీభావాన్ని తెలియజేయాలనుకునే  వ్యక్తులు యాత్రలో చేరకుండా.. రోడ్డుకు ఇరువైపల ఉండ సంఘీభావం తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఇకపోతే... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు శుక్రవారం విమర్శలు కురిపించారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునేలోగా పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది అంటూ చురకలంటించారు. విశాఖ గర్జన, జనవాణి నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య జరిగిన ఘర్షన పరిణామాల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇటీవల వైసీపీ నాయకుల మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చెప్పు చూపిస్తూ.. ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. 

ఈ క్రమంలోనే అంబటి రాంబాబును ఉద్దేశించి... మాట్లాడుతూ.. ‘పోలవరం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తి అవుతుందో..ఒక్క అరగంట ప్రెస్ మీట్ పెట్టి మట్లాడగలవా అంబటి? అంటూ ఫైర్ అయ్యారు. దీన్నీ జనసేన ప్లయర్ లా తయారు చేసి.. సర్క్యూలేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దీనిమీద అంబటి రాంబాలు ఆ ఫ్లయర్ ను షేర్ చేస్తూ ‘పవన్ నాలుగో పెళ్లి చేసుకునేలోపు పూర్తి చేసే బాధ్యత నాది’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
 

click me!