నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు ఇంకా ఇరుక్కుంటారు : భువనేశ్వరి యాత్రపై మంత్రి అంబటి సెటైర్లు

By Siva Kodati  |  First Published Oct 26, 2023, 4:51 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ‘‘నిజం గెలవాలి’’ బస్సు యాత్రపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు . అబద్ధం, అన్యాయం , అవినీతి గెలవాలని భువనేశ్వరి యాత్ర చేస్తే మంచిదని ఆయన చురకలంటించారు .


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ‘‘నిజం గెలవాలి’’ బస్సు యాత్రపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు . నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని రాంబాబు సెటైర్లు వేశారు . అబద్ధం, అన్యాయం , అవినీతి గెలవాలని భువనేశ్వరి యాత్ర చేస్తే మంచిదని ఆయన చురకలంటించారు . గురువారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. 

అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది.. సీఎం వైఎస్ జగన్‌పై బురద జల్లేందుకు పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసులో ప్రాథమిక ఆధారాలు వున్నాయని.. అందుకే ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని రాంబాబు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ విని కొందరు మృతి చెందారట.. వారిని పరామర్శించే కార్యక్రమం పెట్టారని ఆయన దుయ్యబట్టారు. నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైల్లో వున్నారని వ్యాఖ్యానించారు. 

Latest Videos

ALso Read: సామాజిక సాధికార బస్సు యాత్ర: ఇచ్ఛాపురంలో ప్రారంభించిన బొత్స

2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు 23 సీట్లకే పరిమితం చేశారని.. చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారని రాంబాబు ప్రశ్నించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిజం చెప్పారా అని అంబటి నిలదీశారు. రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా అంబటి రాంబాబు నిలదీశారు. వ్యవస్ధలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని.. సీఎం జగన్‌కు ఆ అలవాటు లేదని మంత్రి తెలిపారు. ధర్మంగా వెళ్లాలనే పద్ధతిలోనే తాము వెళ్తామని రాంబాబు స్పష్టం చేశారు. ఒక్క మద్యం తయారీ సంస్థకు అనుమతి ఇవ్వలేదని.. కొత్త బ్రాండ్‌లకు వైసీపీ అనుమతి ఇవ్వలేదని మంత్రి తెలిపారు. భూం భూం బీర్ల కంపెనీకి అనుమతిని ఇచ్చింది చంద్రబాబేనని రాంబాబు చెప్పారు. 

click me!