సామాజిక సాధికార బస్సు యాత్ర: ఇచ్ఛాపురంలో ప్రారంభించిన బొత్స

By narsimha lode  |  First Published Oct 26, 2023, 3:00 PM IST

సామాజిక సాధికారిక బస్సు యాత్రను  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జెండా ఊపి ప్రారంభించారు మంత్రి బొత్స సత్యనారాయణ.


శ్రీకాకుళం: సామాజిక సాధికార బస్సు యాత్రను మంత్రి  బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో  జెండా ఊపి ప్రారంభించారు.  ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం  ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను  బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారు  మంత్రులు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో  90 శాతానికి పైగా అమలు చేసిన విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు.
 రాష్ట్రంలోని మూడు చోట్ల ఒకేరోజున   సామాజిక సాధికారిత బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం,. కోస్తాలోని తెనాలి, రాయలసీమలోని శింగనమల నుండి బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. 53 నెలల వైఎస్ జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను  ప్రజలకు వివరించనున్నారు నేతలు. ఎస్‌సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన  వైసీపీ నేతలు బస్సు యాత్రలో ఉంటారు.  

Latest Videos

గత ఏడాది సామాజిక న్యాయభేరి  బస్సు యాత్రను  వైసీపీ నిర్వహించిన విషయం తెలిసిందే.2022 ఆగస్టు మాసంలో వైసీపీ నేతలు ఈ బస్సు యాత్ర నిర్వహించారు.  రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో  విజయం సాధించాలంటే ప్రజలకు  జరిగిన ప్రయోజనాన్ని ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.  ఈ క్రమంలోనే  బస్సు యాత్రలను నిర్వహిస్తుంది.

click me!