రేణు దేశాయ్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్ ఇదే

Published : Aug 10, 2023, 11:58 PM ISTUpdated : Aug 11, 2023, 06:49 AM IST
రేణు దేశాయ్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్ ఇదే

సారాంశం

రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. పిల్లలు, మహిళలను రాజకీయాల్లోకి లాగొద్దని రేణు దేశాయ్ కోరగా.. తమ క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందవద్దని పవన్‌కు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు.  

అమరావతి: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా విడుదలైన బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ పాత్ర మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ సాగిందని, మంత్రి అంబటిని కించపరిచేలా సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అంబటి రాంబాబు కూడా ఆ పాత్రపై స్పందిస్తూ సినిమాపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. తాను కూడా ఓ సినిమా తీస్తున్నానని, దానికి పెళ్లి పెటాకులు, బహుభార్యలు, ప్రవీణుడు వంటి కొన్ని పేర్లు పరిశీలిస్తున్నట్టు పరోక్షంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కామెంట్లు చేశాడు.

అయితే, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాడని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, రాజకీయాల కోసం ఆయన పిల్లలు, భార్యను రాజకీయాల్లోకి లాగొద్దని, ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండంటూ కామెంట్ చేశారు. బ్రో సినిమా గురించిన వివాదం గురించి తనకు పెద్దగా అవగాహన లేదని, కానీ, ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి సినిమా ఉంటుందని మంత్రి చెప్పారని, ఒక తల్లిగా తన వ్యక్తిగత అభ్యర్థనగా ఈ మాట అంటున్నట్టు రేణు దేశాయ్ పేర్కొన్నారు.

Also Read: చిన్నారి పాపను కొమ్ములతో కుమ్మిన ఆవు.. కిందపడేసి కడుపులో కాళ్లతో తొక్కి.. ఒళ్లు జలదరించే వీడియో ఇదే

పిల్లలను, ఆయన మాజీ భార్యను రాజకీయాల్లోకి లాగొద్దని రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమ్మా రేణూ.. తమ క్యారెక్టర్లు సినిమాలో పెట్టి శునకానందం పొందవద్దని మాజీ భర్తకు చెప్పండి అంటూ అంబటి రాయుడు కామెంట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?