
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో ఖాళీగా వున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ నామినేట్ చేసిన కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద భర్తీ చేస్తున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వున్న శివనాథ్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్‌ల పదవీకాలంలో జూలై 20తో ముగిసింది. దీంతో పద్మశ్రీ, రవిబాబులను వారి స్థానంలో భర్తీ చేశారు. వీరి పదవీ కాలం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఆరేళ్ల పాటు వుంటుందని ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వుల్లో తెలిపారు.