చంద్రబాబు ముసలి సైకో.. కోడెల ఆత్మహత్యకు ఆయనే కారణం: మంత్రి అంబటి

Published : Apr 27, 2023, 12:52 PM IST
చంద్రబాబు ముసలి సైకో.. కోడెల ఆత్మహత్యకు ఆయనే కారణం: మంత్రి అంబటి

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సత్తెనపల్లిలో చంద్రబాబు చేసింది అట్టర్ ప్లాప్ షో అని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సత్తెనపల్లిలో చంద్రబాబు చేసింది అట్టర్ ప్లాప్ షో అని విమర్శించారు. జనం రాకపోయిన మహా అద్భుతం అని అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముసలి సైకో అని.. అధికారం లేకపోతే బతకలేడని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తాడని.. తిట్టినవారిపై కూడా ప్రశంసలు కురిపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఇచ్చారని అన్నారు. కోడెల శివప్రసాద్ మరణానికి తాను కారణమని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 

కోడెల శివప్రసాద్ ఉరి వేసుకుని ఆత్మహత్య వేసుకోవడానికి ప్రధాన  కారణం చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. కోడెల శివప్రసాద్‌ తమ రాజకీయ ప్రత్యర్థి అని చెప్పారు. కోడెల శివప్రసాద్‌పై అనేక ఆరోపణలు వచ్చాయని, ప్రజలు ఫిర్యాదులు చేశారని.. వాటిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని  తెలిపారు. ఇదేమైనా అరాచమా? వేధింపులా? అని ప్రశ్నించారు. ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం కంటే అబద్దం ఉంటుందా? అని ప్రశ్నించారు. 

Also Read: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 100 సీట్లు.. రికార్డు సృష్టించనున్న కేసీఆర్..: కేటీఆర్

కోడెల శివప్రసాద్‌పై కేసులు పెట్టినందుకు చనిపోలేదని అన్నారు. కోడెల శివప్రసాద్‌పై తాము కేసులు పెట్టినా టీడీపీ నుంచి ఆదరణ లేదని అన్నారు. చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కోడెల శివప్రసాద్ మత్తు మాత్రలు మింగి ప్రాణాలు తీసుకోవాలని చూసినప్పుడు.. చంద్రబాబు ఆయనను పరామర్శించేందుకు కూడా ఇష్టపడలేదని ఆరోపించారు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

కోడెల శివప్రసాద్‌ స్వర్గస్తులు అయినారని ఆయనపై ప్రస్తుతం తాను విమర్శలు చేయదలుచుకోవడం లేదని అన్నారు. అలాంటి అంశాలు అవసరమైనప్పుడు మాత్రమమే మాట్లాడతానని  చెప్పారు. కోడెల కుటుంబానికి ద్రోహం చేసింది చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు.. సత్తెనపల్లి వచ్చి తనపై విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. 

Also Read: బీజేపీకి, ఇతర పార్టీలకు ఉన్న తేడా ఇదే.. : కర్ణాటక బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ

చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఆంబోతులకు ఆవులను సరఫరా చేయడమేనని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, కోడెల శివప్రసాద్‌ల కన్నా తాను వంద రెట్లు నీతిమంతుడునని తెలిపారు. తెలుగుదేశం వాళ్లకు కూడా అన్యాయం జరగకూడదని అనుకునే వ్యక్తిని తానని చెప్పారు.  తన తమ్ముడు కనిపించడం లేదని చంద్రబాబు విమర్శించారని.. అయితే వాళ్లు ఎన్నికల సమయంలో తన తరఫున ప్రచారం చేశారని, మళ్లీ చేస్తారని  చెప్పారు. చంద్రబాబు తమ్ముడు ఎందుకు కనిపించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క నిజం చెప్పారా? అని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు