వివేకా పీఏ భార్య, కొడుకును విచారించిన సీబీఐ: కన్పించని కృష్ణారెడ్డి

By narsimha lodeFirst Published Apr 27, 2023, 12:48 PM IST
Highlights

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కృష్ణారెడ్డి  నివాసానికి  ఇవాళ  సీబీఐ అధికారులు  చేరుకున్నారు.  

కడప : దివంగత  వైఎస్ వివేకానందరెడ్డి వద్ద  పీఏ గా పనిచేసిన   కృష్ణారెడ్డి  ఇంటికి  గురువారంనాడు  సీబీఐ అధికారులు  చేరుకున్నారు. గతంలో  కృష్ణారెడ్డిని సిట్ అధికారులు  అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.  ఇవాళ కృష్ణా రెడ్డి భార్య సుజాత,  కొడుకు  రాజేష్ ను  సీబీఐ  అధికారులు  రెండు గంటలపాటు  ప్రశ్నించారు.  అదేవిధంగా  పులివెందులలోని   లయోలా  కాలేజీకి  సీబీఐ అధికారులు వెళ్లారు. అయితే కాలేజీలో  కృష్ణారెడ్డి  లేకపోవడంతో  సీబీఐ అధికారులు వెనుదిరిగారు.

. వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో ఆధారాలను  చెరిపివేశారని  2019  మార్చి  28న  ఎర్ర గంగిరెడ్డి,  కృష్ణారెడ్డి,  ప్రకాష్ లను అప్పటి సిట్  బృందం అరెస్ట్  చేసింది. 90 రోజుల తర్వాత పులివెందుల  కోర్టు  ఈ ముగ్గురికి  బెయిల్ మంజూరు చేసింది. 2019 జూన్ 27న ఈ ముగ్గురికి  కోర్టు  మంజూరు చేసింది.  దీంతో   ఈ ముగ్గురు  జైలు నుండి  విడుదలయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కృష్ణారెడ్డిని గతంలో  సిట్ బృందం  విచారించింది.  సీబీఐ అధికారులు కూడా విచారించారు.  అయితే  ఇవాళ  కృష్ణారెడ్డి ఇంటికి  సీబీఐ బృందం  రావడం  చర్చకు దారితీసింది. 

Latest Videos

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  జరిగిన  రోజున  వైఎస్ వివేకానందరెడ్డి  రాసిన లేఖ, మొబైల్ ఫోన్ ను  కృష్ణారెడ్డి  దాచిపెట్టారని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఆరోపించారు.   వైఎస్ సునీతారెడ్డి  కుటుంబ సభ్యుల  సూచన మేరకు  కృష్ణారెడ్డి  ఈ లేఖను, ఫోన్ ను దాచి పెట్టారని  అవినాష్ రెడ్డి  చెబుతున్నారు. 

also read:వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి షాక్: బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

ఈ కేసులో  గతంలో  సిట్ బృందం  విచారించిన  వారిని  సీబీఐ  అధికారులు  విచారిస్తున్నారు.   ఈ ఏడాది  జూన్  30వ తేదీ లోపుగా  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణను  పూర్తి  చేయాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.   వారం రోజులకు పైగా  కడప కేంద్రంగా  సీబీఐ  బృందం  విచారణ  చేస్తుంది. 

click me!