
ప్రకాశం జిల్లా (prakasam district) చిన్నకండలేరు చెరువును (chinna kandaleru) ఆదివారం పరిశీలించారు మంత్రి ఆదిమూలపు సురేశ్ (adimulapu suresh). ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు కట్ట పరిస్ధితిపై కలెక్టర్‌తో మాట్లాడారు సురేశ్. గండిని త్వరగా పూడ్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు, నీరు ప్రగతి అంటూ దోచుకున్నారని ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. చెరువుల పటిష్టత పేరుతో పథకాలకు టీడీపీ పేర్లు పెట్టిందని.. ప్రభుత్వ ధనాన్ని నిరుపయోగం చేశారే తప్ప, చెరువులను అభివృద్ధి చేయలేదని ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. రూ. కోట్లతో చేసిన పనులేంటో టీడీపీ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.