ఎల్లుండి పశ్చిమ గోదావరిలో సీఎం పర్యటన.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం

Siva Kodati |  
Published : Dec 19, 2021, 07:45 PM ISTUpdated : Dec 19, 2021, 07:48 PM IST
ఎల్లుండి పశ్చిమ గోదావరిలో సీఎం పర్యటన.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం

సారాంశం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagna mohan reddy) ఈ నెల 21న పశ్చిమగోదావరి (west godavari) జిల్లా తణుకు (tanuku) పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ను (jagananna sampoorna gruha hakku) ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagna mohan reddy) ఈ నెల 21న పశ్చిమగోదావరి (west godavari) జిల్లా తణుకు (tanuku) పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ను (jagananna sampoorna gruha hakku) ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. మంగళవారం ఉదయం జగన్ 10.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11 గంటలకు తణుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. 1.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు జగన్.

ఇటీవల జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌), గృహనిర్మాణంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. సంబంధిత మంత్రితో పాటు అధికారులతో సమావేశమైన సీఎం ఓటిఎస్ (one time settlement) అమలు, గృహ నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా ఓటీఎస్‌ పథకం అమలు, పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎం జగన్ (ys jaganmohan reddy) అందించారు. 

ALso Read:ఇదే మంచి అవకాశం... వాడుకోవాలా? లేదా? అన్నది మీ ఇష్టం..: ఓటిఎస్ పై సీఎం జగన్

22A తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఓటీఎస్‌ (OTS) వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు చేస్తున్నామని... ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌లు ఇస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేసారు. ఓటీఎస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని... దీన్ని వినియోగించుకోవడం ద్వారా ఏ రకంగా మంచి జరుగుతుందో చెప్పాలని సూచించారు. ఓటీఎస్‌ అన్నది పూర్తి స్వచ్ఛందమని... ఇష్టపూర్వకంగానే జరపాలని సూచించారు. ఆ పథక లబ్దిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని సీఎం తెలిపారు. రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని వెల్లడించారు. వారి రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్