(వీడియో) కొద్దిసేపు పిచ్చోడి చేతికెళ్లిన ప్రకాశం బరాజ్

First Published May 16, 2017, 11:34 AM IST
Highlights

రిపేర్ల కోసం మూసేసిన  విజయవాడ సమీపంలోని ప్రకాశం బ్యారేజీ గేట్లు ఉన్నట్లుండి  తెరచుకున్నాయి. ఎవరో పిచ్చోడు  బ్యారేజ్ ను అదుపులోకి తీసుకున్నాడు. అతను గేట్ల కంట్రోల్ రూంలో చొరబడి రెండుగేట్లు ఏత్తి వేశాడు. దీనికోసం అక్కడ స్విచ్ లను నొక్కాడు. ఈ రెండు గేట్లు తెర్చుకున్నాయి. బాగా నీరు వృథా అయింది.

 

 

రిపేర్ల కోసం మూసేసిన  విజయవాడ సమీపంలోకి ప్రకాశం బరాజ్ గేట్లు ఉన్నట్లుండి తెరచుకున్నాయి. ఎవరో పిచ్చోడు  బరాజ్ ను అదుపులోకి తీసుకున్నాడు. అతను గేట్ల కంట్రోల్ రూం కు  వెళ్లి రెండుగేట్లు ఏత్తి వేశాడు. దీనికోసం అక్కడ స్విచ్ లను నొక్కాడు. ఈ రెండు గేట్లు తెర్చుకున్నాయి. బాగా నీరు వృథా అయింది.

 

హఠాత్తుగా ఈ మధ్యాహ్నం 58, 59 నెంబర్ గేట్ల నుంచి నీరు విడుదల కావడం చాలా ఆలస్యంగా అధికారులు గుర్తించి, కంట్రోల్ రూం దగ్గరకు పరుగుతీశారు. అక్కడ రెండు గేట్లు తీసి ఉండటం గ మనించి, హడావిడిగా మూసేశారు. ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తి ప్రవేశించాడని, అతనే ఇలా స్విచ్ నొక్కి అలా గేట్లు తెరుచుకునేలా చేశాడని చెబుతున్నారు.

 

ఇలా ఒక పిచ్చోడు మధ్యాహ్నం పూట బరాజ్ దాకా వెళ్లడం, కంట్రోల్ రూంలో చొరబడటం, అతగాడు ఏకంగా స్విచ్ బోర్డు దాకా వెళ్లి స్విచ్ లేయడం.... ఇదంతా చూస్తుంటే, అక్కడ  మనుషులే లేరా? సెక్యూరిటీ సిబ్బంది, నీటిపారుదల శాఖ అధికారలు లేరా?

 

పిడుగురాళ్లకు చెందిన బాబూ రావు అనే మనిషిని పోలీసుల ప్రశ్నించారట.అయితే,  మందుపుచ్చుకుని మత్తులో ఒక ఉద్యోగిపొరపాటున ఈ పనిచేశారని మరొక కథనం వినబడుతూ ఉంది.

 

 

click me!