సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలిస్తున్నారు. అక్కడినుంచి ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లికి తరలిస్తారు. ఆ షెడ్యూల్ ఎలా ఉందంటే...
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత Minister Mekapati Goutham Reddy సోమవారం heart attackలో అకాలమృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. నిన్న తెలంగాణలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో మరణించిన ఆయనను అనంతరం.. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడినుంచి మంగళవారం ఉదయం ఆయన స్వగ్రామం అయిన బ్రాహ్మణపల్లికి తీసుకువెడుతున్నారు. కాగా.. రేపు అంటే బుధవారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ షెడ్యూల్ ఎలా ఉందంటే..
- ఉదయం 06:50 గం.లకు బేగంపేట విమానాశ్రయం నుంచి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బయలుదేరిన దివంగత మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు
- ఉదయం 08:25గం.లకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసం నుంచి మంత్రి మేకపాటి భౌతిక దేహం తరలింపు
- 10గం.లకు బేగంపేట విమానాశ్రయం నుంచి తరలించనున్న కుటుంబ సభ్యులు
- మంత్రి మేకపాటి పార్థివ దేహం వెంట ప్రభుత్వం ఏర్పాటు చేసిన చాపర్ లో వెళ్ళనున్న తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి
- 11.15గం.లకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కి చేరుకోనున్న చాపర్
- 11.25గం.లకు డైకాస్ రోడ్డులోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి పార్థివదేహం చేరిక
- 11.30 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రజల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్థివదేహాన్ని ఉంచనున్న మేకపాటి కుటుంబం
- ఇప్పటికే యూ.ఎస్ నుంచి బయలుదేరిన మంత్రి మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి రాత్రి 11గం.లకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి చేరుకునే అవకాశం
- బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో సీఎం మంత్రి మేకపాటి భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు
అంత్యక్రియలు: బుధవారం (23-02-2022) ఉదయం 11గం.లకు, మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, ఉదయగిరి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
undefined
మేకపాటి గౌతంరెడ్డి గురించి...
మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. మేకపాటి వయస్సు 49 సంవత్సరాలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకెలో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి Mekapati Goutham Reddy హఠాన్మరణంపై ముఖ్యమంత్రి YS Jagan తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషిచేశారని. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకు వచ్చారని సీఎం అన్నారు.