ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 182 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కరోనా నుంచి 950 మంది కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 182 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,16,467కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,714కి చేరుకుంది.
24 గంటల్లో కరోనా నుంచి 950 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,95,768కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 14,249 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,29,91,889కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,985 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 3, చిత్తూరు 12, తూర్పుగోదావరి 70, గుంటూరు 15, కడప 8, కృష్ణ 24, కర్నూలు 1, నెల్లూరు 15, ప్రకాశం 15, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 4, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 15 చొప్పున వైరస్ బారినపడ్డారు.
undefined
ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 425,074,129 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,906,501 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం కేసుల్లో 350,781,802 మంది కోలుకున్నారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే, రష్యా, జర్మనీ, టర్కీ, ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, ఇరాన్ లు టాప్ లో ఉన్నాయి. గత నెల రోజుల నుంచి భారత్ పంజా విసిరిన కరోనా వైరస్ ప్రస్తుతం గణనీయంగా క్షీణించింది. కొత్త కేసులు ఏకంగా 20 వేల దిగువకు పడిపోయాయి.
భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా క్షీణించగా.. మరణాలు సైతం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,051 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,28,38,524 కు పెరిగింది. ఇదే సమయంలో 37,901 (RECOVERED) మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,21,24,284 కి పెరిగింది. ప్రస్తుతం 2,02,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 206 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,12,109 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.3 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.1 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ లు టాప్ లో ఉన్నాయి. ఇదిలావుండగా, కరోనా ప్రభావం నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 175.5 కోట్ల కోవిడ్-19 టీకా డోసులను పంపిణీ చేశారు. అందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 90.7 కోట్లు ఉండగా, రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 75.3 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
: 21/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,467పాజిటివ్ కేసు లకు గాను
*22,95,768 మంది డిశ్చార్జ్ కాగా
*14,714 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,985 pic.twitter.com/EfABRhoc0r