సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించిన చిరంజీవి..

Published : Jun 22, 2021, 03:25 PM IST
సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించిన చిరంజీవి..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రశంసల జల్లు కురిపించారు.

కోవిడ్ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని 
సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. కోవిడ్ నియంత్రణ కోసం ఏపీ ప్రబుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

కాగా, కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆదివారం ఒక్క రోజే 13లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. వాస్తవానికి ఒక్క రోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. దాన్ని అధిగమిస్తూ... ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu