ఇందులోనూ చేతివాటమేనా జగన్ రెడ్డి...: మాజీ ఎమ్మెల్యే సంధ్యారాణి ఫైర్

By Arun Kumar PFirst Published Jun 22, 2021, 2:12 PM IST
Highlights

గిరిజనులు ఓట్లువేయడానికే తప్ప.. పథకాల ద్వారా లబ్ది పొందడానికి పనికిరారు అనేలా సీఎం జగన్ వ్యవహారం వుందని టిడిపి మాజీ ఎమ్మెల్యే సంధ్యారాణి మండిపడ్డారు. 

అమరావతి: చేయూత పేరుతో 45 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు అందించే సాయంలోనూ జగన్ రెడ్డి చేతివాటం చూపి గిరిజన ద్రోహిగా మారారని టిడిపి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. . గిరిజనులు ఓట్లువేయడానికే తప్ప.. పథకాల ద్వారా లబ్ది పొందడానికి పనికిరారు అనేలా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

''చేయూత పేరుతో ప్రకటనలకు చేసినంత ఖర్చు కూడా జగన్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి చేయలేదు. ఇప్పుడు ఇస్తున్న చేయూతలో కూడా గిరిజన మహిళలకు దగా చేశారు. రాష్ట్రంలో ఉన్న గిరిజన మహిళల సంఖ్య ఎంత.? ప్రభుత్వం సాయం అందించింది ఎంత మందికి.?'' అని నిలదీశారు. 

''వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే రూ.50వేలు రుణం ఇప్పిస్తామని ప్రకటించి.. ఆ రుణానికి కనీసం బ్యాంకులకు గ్యారంటీ కూడా ఇవ్వకుండా తప్పించుకోవడం మహిళల్ని మోసం చేయడం కాదా జగన్ రెడ్డీ.? గ్యారంటీ ఇవ్వకుంటే ఎవరు రుణాలిస్తారు.? వ్యాపారాలు ఎలా పెట్టుకునేది.? ఇదేనా మహిళల్ని వ్యాపారస్తుల్ని చేయడం అంటే.?'' అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

read more  అన్నలా వుంటానని... మహిళలతో దున్నలా వ్యవహరిస్తావా..: జగన్ పై కొల్లు రవీంద్ర సీరియస్

''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల ద్వారా రూ.2లక్షల చొప్పున రుణాలిచ్చి, బ్యాంకులకు గ్యారంటీలిచ్చి.. రాయితీలు కల్పించడం జరిగింది. వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి భూములు, అవసరమైన ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. మహిళలు ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించడమే లక్ష్యంగా నాడు డ్వాక్రా గ్రూపులకు శ్రీకారం చుట్టి.. నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం పొందేలా ప్రణాళిక రూపొందించాం. అందుకు అనుగుణంగా అడుగులు వేశాం'' అని తెలిపారు. 

''నేడు వ్యాపారస్తుల్ని చేస్తామంటూ ఆర్భాటంగా పత్రికల్లో ప్రకటనలు అచ్చు వేయించుకుంటూ.. బ్యాంకులకు గ్యారంటీ కూడా ఇవ్వకుండా తప్పించుకోవడం గిరిజన మహిళల్ని మోసం చేయడం కాదా.? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజనులకు అందిన వందలాది పథకాలను రద్దు చేసి.. చిల్లర వేస్తూ అదే సంక్షేమం అనడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. చేయూత పేరుతో ఇస్తానన్న పెన్షన్లు ఎగ్గొట్టి.. అందాల్సిన సంక్షేమ పథకాలు రద్దు చేసి.. చేతులకు సంకెళ్లు వేసి బ్యాంకులకు తాకట్టు పెట్టడమేనా గిరిజన మహిళలకు మీరు చేసే మేలు.?'' అని సంధ్యారాణి తీవ్ర విమర్శలు చేశారు. 


 

click me!